ఆరు గ్యారంటీల ను కాంగ్రెస్ అమలు చేస్తుంది
కాంగ్రెస్ పార్టీ
జగిత్యాల జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షుడు ఎండి వసీం*
కోరుట్ల లోని 32 వ వార్డులలో గృహాజ్యోతి పథకంలో వివరాలు సేకరణ
కోరుట్ల,
: ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షుడు ఎండి వసీం ఆన్నారు.. బుధవారం పట్టణంలోని
ఐ బి గెస్ట్ హౌస్ లో గృహజ్యోతి పథకానికి సంబంధించిన వివరాలను విద్యుత్ అధికారులు సేకరించి ఆన్లైన్ చేశారు.
ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఉపాధ్యక్షుడు వసీం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పని మడిమ తిప్పని ప్రభుత్వమని రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రజాపాలనలో ప్రతి పేదవాడికి స్వేచ్ఛగా మేలు జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ ఆరు గ్యారెంటీలో రెండు గ్యారెంటీ అమలు అవుతున్నాయని, మహిళలకు ఉచిత బస్సు గ్యారంటీని చూసి బీఆర్ఎస్ నాయకులు బాధపడుతున్నారన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ 6 గ్యారంటీలో భాగంగా ఒకటైన గృహ జ్యోతి పథకం లోని 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకాన్ని ఆన్లైన్ చేసుకొని
సద్వినియోగం చేసుకోవాలి
ఆరు గ్యారెంటీల ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి మేలు జరుగుతుందని రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ వలన నిరుద్యోగ యువత జీవితాలు బాగుపడతాయి ,ఇల్లు లేని నిరుపేదలకు
గృహజ్యోతి పథకం కూడా ద్వారా అందరిలో అమలు ఆవుతుందని, రాబోయే ఇందిరమ్మ రాజ్యం సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వం ఏర్పడుతుందన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం మతోన్మాద ప్రభుత్వం ఓడించి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు మద్దతు పలకాలని ఆయన పిలుపునిచ్చారు..
ఈ కార్యక్రమంలో విద్యుత్తు సిబ్బంది,కాంగ్రెస్ పార్టీ నాయకులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు..