సిరిసిల్ల నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది :మంత్రి పొన్నం ప్రభాకర్
Government is committed to welfare of Sirisilla Netannala:Minister PonnamPrabhakar
హైదరాబాద్
సిరిసిల్ల నేతన్నలకు ఇందిరా మహిళా శక్తి చీరల కోసం 4.24 కోట్ల మీటర్ల ఆర్డర్
ఇప్పటికే పెండింగ్ లో ఉన్న 500 కోట్ల బకాయిలు విడుదల. మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ
సిరిసిల్ల చేనేత కార్మికులకు ప్రజా పాలన ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం స్వయం సహాయక సంఘాలకు అందించే యూనిఫాం చీరల ఆర్డర్ ఇచ్చి పెద్ద ఎత్తున పని కల్పించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు అందించే ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా అందరికీ ఒకే రంగు గల ఒక్కొకరికి ఒక్కో చీరను అందజేసేందుకు 4.24 కోట్ల మీటర్ల చీరల ఆర్డర్స్ అందజేసినట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 30 వ తేది లోపు ఈ చీరలు సిద్ధం కానున్నాయని ఆకాంక్షించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల కి 50 కోట్లతో యార్న్ బ్యాంక్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
స్కూల్ యూనిఫాం మరమగ్గాల సంఘాలకు 65.67 లక్షల మీటర్స్ ఆర్డర్ ఇచ్చామని గుర్తు చేశారు. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న వివిధ శాఖలకు సంబంధించి 500 కోట్ల బకాయిలు విడుదల చేశామని తమ ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని వెల్లడించారు. గత ప్రభుత్వం చేనేత కార్మికుల సమస్యలను విస్మరించిందని బకాయిలు కూడా చెల్లించకుండా చేనేత కార్మికులను ఇబ్బందులకు గురి చేసిందని తెలిపారు.