- Advertisement -
హుస్నాబాద్ లో పలు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం
Minister Ponnam laid foundation stone for many works in Husnabad
హుస్నాబాద్
హుస్నాబాద్ నియోజకవర్గంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసారు. 10 వ వార్డు (జీ ఆర్ రెడ్డి కాలని లో) 50 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం & మురికి కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న,సింగిల్ విండో చైర్మన్ శివయ్య,కౌన్సిలర్లు ,హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి,వైస్ చైర్మన్ బంక చందు,ఇతర ముఖ్య నేతలు అధికారులు పాల్గోన్నారు.
మంత్రి పొన్నం మాట్లాడుతూ జీ ఆర్ ఆర్ కాలని లోని రోడ్లు మురికి కాలువల నిర్మాణాలను శంఖు స్థాపన చేసుకున్నాం. ముంపు బాధితుల సమస్యలు తెలుసు మేము లోయర్ మనేర్ డాం నిర్వసితులేం విలువైన భూమిని అప్పుడు 1800 లకి ఎకరం ఇచ్చినం. ఎన్నిక కాగానే మీ సమస్య పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరకు వెళ్లిన మార్చ్ తరువాత చేద్దామన్నారు. ముంపు గ్రామాల సమస్యలు ఏమున్నా మార్చ్ తరువాత మీ సమస్యలు అన్ని పరిష్కారం చేస్తాం ఆధి నా బాధ్యత అని అన్నారు.
పట్టణంలో 20 కా వార్డుల్లో రోడ్లు , మురికి కాలువల నిర్మాణానికి 50 లక్షలు చొప్పున ఇస్తున్నాం .పది సంఘాలకు 45 లక్షల చొప్పున ఇచ్చాం . హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ అభివృద్ధికి శంఖు స్థాపన చేసుకున్నాం. ఈ కాలని రోడ్లు నిర్మాణానికి ప్రత్యేకంగా 10 లక్షలు ఇస్తున్నాం. టాక్స్ రావాలి ఆదాయం రావాలి హక్కు రావాలి. ప్రభుత్వం నిబంధనలో మీరు ఉండలని కోరుకుంటున్నారు.. మున్సిపల్ శాఖ తో మాట్లాడి మీ సమస్య పరిష్కారం చేస్తా. ఈ కాలని లో వెంటనే ఓపెన్ జిమ్ ప్రారంభం చేస్తా. అమ్మ వారి గుడి ప్రారంభం చేయండి.. నేను వ్యక్తిగతంగా 50 వేలు ఇస్తాను..నిర్మాణం లో భాగస్వామ్యం తీసుకుంటా . డ్రింకింగ్ వాటర్ మిషన్ భగీరథ కింద నా అమృత్ కింద నా అందిస్తాం. నియోజవర్గం లో ఒక బిందె కూడా. బయటకు వచ్చి నిరసనలు ఉండకూడదు. గత సంవత్సరం కూడా ముందే మంచినీటి సమస్య లేకుండా ప్లాన్ చేసామని అన్నారు.
ఆరోగ్యానికి ,వ్యవసాయానికి నా ప్రాధాన్యం. గౌరవెల్లి,మిడ్ మానేరు, మల్లన్న సాగర్ కు సంబంధించిన కేసులు ఎత్తివేయాలని గౌరవ ముఖ్యమంత్రి ని కోరుతున్నా. నా మీద కేసులు ఉన్నాయి.. ముఖ్యమంత్రి మీద కూడా కేసులు ఉన్నాయి..
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మహిళలకు ఆర్థిక వృద్ధి సాధించడానికి కొన్ని ఇంట్లో కూర్చొని చేసే పనులు ఉన్నాయి
సెట్విన్ శిక్షణ కేంద్రాన్ని పరిశీలించి ఆసక్తి ఉన్నవారు శిక్షణ తీసుకోండి..మెప్మా ద్వారా మీకు ఏ పథకాలు ఉన్నాయనేది చూస్తారు. ఆర్థికంగా వెసులుబాటు ఉండే కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ..
- Advertisement -