Friday, February 7, 2025

ఆయన సూచనతో పవన్…

- Advertisement -

ఆయన సూచనతో పవన్…

With his suggestion, Pawan...

కాకినాడ, డిసెంబర్ 31, (వాయిస్ టుడే)
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టిన వెంటనే ఆయన ఎంచుకున్న విషయాల్లో అతి ముఖ్యమైనది తనను సరైన రూట్ లో నడిపించే అధికారి కోసం. అందుకోసం చాలా అన్వేషణ జరిపారు. అనేక మంది అభిప్రాయాలను తీసుకున్నారు. సమాచారాన్ని సేకరించారు. చివరకు కేరళలో ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్న కృష్ణతేజ్ ను తన ఓఎస్డీగా నియమించుకున్నారు. కేంద్ర ప్రభుత్వంతో చెప్పి మరీ యువ ఐఏఎస్ అధికారి కృష్ణతేజను నియమించుకున్న తర్వాత తనకు అప్పగించిన ముఖ్యమైన శాఖలపై అధ్యయనం చేశారు. కొంతకాలం అధికారులతో సమీక్షలకే పరిమితమయిన పవన్ కల్యాణ్ ఇప్పుడు క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఇక అనేక కేంద్ర ప్రథకాలను రాష్ట్రానికి తీసుకురావడం వెనక కూడా ఐఏఎస్ అధికారి కృష్ణతేజ సూచనలు ఉన్నాయంటున్నారు. కృష్ణతేజ ఈ పథకం కింద నిధులు తేవచ్చని పవన్ కల్యాణ్ కు చెప్పడం, దాని వల్ల ఎంత నిధులు వస్తాయి? ఏ మేరకు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయవచ్చు? ఏ ఏ ప్రాంతాల్లో వాటిని ఖర్చు పెట్టాలి? నిబంధనలు ఏంటి? వంటి వాటిపై పవన్ కు బ్రీఫింగ్ ఇవ్వడంతో పవన్ కల్యాణ్ వెంటనే కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి నిధులను తెప్పిస్తున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో నిధులు, సర్పంచ్ లకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేయడంతో పాటు గ్రామసభలను ఏర్పాటు చేసి వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని ఆ పనులను చేపట్టడం వంటివి చేస్తూ నిజంగానే పల్లె పండుగ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికీ అనేక మారుమూల ప్రాంతాలకు రహదారుల సౌకర్యం లేకపోవడం, డోలీలతో రోగులను తీసుకెళ్లడం కొన్ని దశాబ్దాల నుంచి చూస్తునే ఉన్నాం. అయితే ప్రభుత్వాలు మారినా ఆ ప్రాంతాలకు రహదారుల నిర్మాణం జరగలేదు. అస్సలు దానిపై ఎవరూ దృష్టి కూడా పెట్టలేదు. కానీ గ్రామీణాభివృద్ధి శాఖమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత పవన్ కల్యాణ్ ఆ ప్రాంతానికి రహదారుల నిర్మాణం జరగాల్సిందేనంటూ పట్టుబట్టి నిధులను కేటాయించారు. ఇప్పటికే కొన్ని గ్రామాలకు రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి.భవిష్యత్ లోనూ నిధులను ఏజెన్సీలో రహదారుల నిర్మాణం కోసం పవన్ వెచ్చించే అవకాశముంది.పవన్ కల్యాణ్ కు ఒక వెసులు బాటు ఉంది. ఇతర మంత్రుల్లాగా ఆయన నిధుల కోసమో… మరెవరి ఆదేశాల కోసమో ఎదురు చూడాల్సిన పనిలేదు. ఆయనకు ఏది మంచి అనిపిస్తే అది చేయడానికి అనువైన వాతావరణం ఉంది. ఆయన మాటను, ఆదేశాలను ఎవరూ కాదనలేని పరిస్థితి ఏపీలో ప్రస్తుత రాజకీయాల్లో ఉంది. అందుకే ఆయన ఫ్రీగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనికి తోడు కృష్ణ తేజ వంటి మంచి అధికారి పక్కన ఉండటంతో ఇక ఆయనకు ఎదురులేకుండా పోతుంది. రాజకీయాల్లోకి వచ్చిన పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన జనసేనను నిజంగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఈ యువ ఐఏఎస్ అధికారి సూచనలను పవన్ ను కరెక్ట్ డైరెక్షన్ లోనే పనిచేస్తున్నాయి. ఇటీవల కడప వెళ్లి వైసీపీ నేతల దాడిలో గాయపడిన ఎంపీడీవో జవహర్ ను పరామర్శించడం కూడా పవన్ కల్యాణ్ రాజకీయ పరిణితి ప్రదర్శించారంటున్నారు. సో.. డైరెక్షన్ కృష్ణతేజ అని జనసేనలో అందరూ చెబుతున్న విషయం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్