0.1 C
New York
Wednesday, February 21, 2024

8వ జాతీయ రోజ్గార్ మేళా

- Advertisement -

క్రమశిక్షణ, అంకితభావంతో పని చేయండి..

దేశ సమగ్రత, సమైక్యతను కాపాడండి

8వ జాతీయ రోజ్గార్ మేళా లో  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

8th National Career Fair
8th National Career Fair

హైదరాబాద్ : హాకింపెట్ నీసా అంతరిక్ష ఆడిటోరియంలో జరిగిన 8వ “రోజ్ గార్ మేళా” లో కేంద్రమంత్రి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసారు.  సీఐఎస్ఎఫ్, సీఆర్పిపిఎఫ్, ఐటీబీపీ,  ఎస్ఎకస్బీ గాల్లో మొత్తం 4శాఖల్లో ఉద్యోగాలు పొందిన 323 మంది అభ్యర్థులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ లెటర్స్ అందించారు

మంత్రి మాట్లాడుతూ  నేడు జరిగిన 8వ రోజ్గార్ మేళాతో కలుపుకుని మొత్తం ఇప్పటివరకు 5లక్షల 50వేలకు పైగా మంది యువతకు ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్లు అందజేశాం.  కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న రోజ్గార్ మేళాలో భాగంగా ఇవాళ అపాయింట్మెంట్ లెటర్లు అందుకుంటున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు. మీ తల్లిదండ్రులకు కూడా మన:పూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  మొన్న పంద్రాగస్టు సందర్భంగా ఎర్రకోట నుంచి దేశానికి దిశా నిర్దేశం చేస్తూ.. వెయ్యి-1200 ఏండ్ల క్రితం నుంచే మన దేశంపై దాడులు జరిగాయి. ఎన్నో కుట్రలు జరిగిన విషయాన్ని గుర్తుచేశారు. అయినా.. మన సంస్కృతి, సంప్రదాయాలు, మన కళలు ఇప్పటికీ అలాగే నిలిచి ఉన్నాయన్నారు. ఎందరు ఎన్ని  ప్రయత్నాలు చేసినా.. దేశ సమగ్రత చెక్కుచెదరలేదన్నారు. భారతీయుల్లో ఉన్నటువంటి జాతీయ భావన, యువతలో ఉన్నటువంటి దేశం కోసం, మన గడ్డ సమగ్రతను కాపాడేందుకు ఏదైనా చేయాలన్న సంకల్పమే కారణం. దేశ సేవలో మీరు భాగస్వామ్యులు కాబోతున్నారు. దేశ సమగ్రతను దేశ రక్షణకు మీరు అంకితం కాబోతున్నారు నేటి నుంచి మీరు అంకితభావంతో పని చేస్తూ దేశ సేవలో నిమగ్నమౌతారు. ఈ క్రమంలో మీరు ఓ డిసిప్లైన్ మోడ్ లో ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్ద బడతారు అని నమ్ముతున్నాను. దేశం ఈ రోజు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అమెరికా తో పాటు గౌరవాన్ని పొందుతున్నాం దానికి ఉదాహరణ మొన్న చంద్రాయన్ పై అడుగు పెట్టడమే అన్నారు. అందుకే మీలాంటి యువతకు సాధికారత కల్పించడం ద్వారా నాటి వైభవాన్ని పున:ప్రతిష్టించుకునేందుకు మోదీజీ సంకల్పించారు. మన దేశానికి.. స్పెషల్ అడ్వాంటేజ్ అయిన యువత సామర్థ్యాన్ని దేశం కోసం సద్వినియోగం చేసుకోవాలనేది మోదీ  ఆలోచన. ఇందుకోసం అవసరమైన నైపుణ్యాన్ని కల్పించడంతోపాటు వారికి సరైన అవకాశాలు కల్పించడం మోదీ  ఆలోచన. దానికి తగ్గట్లుగానే 9 ఏళ్లుగా.. ఒక్కొక్కటిగా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నాం.. వచ్చే 25 ఏళ్ల కాలం ‘అమృత కాలం’. భారతదేశ చరిత్రలో ఇది అత్యంత కీలకమైన సమయం.ఈ సమయంలో.. మనలోని బానిస ఆలోచనలను తొలగించుకుని కేవలం జాతీయవాద భావనను మదిలో నింపుకుని యువత ముందడుగేయాలి.

కేంద్రం యువతకు ఓవైపు ఉపాధి అవకాశాలు కల్పిస్తూనే.. మరోవైపు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా నైపుణ్యాన్ని అందిస్తూ.. ఉద్యోగాలకోసం వేచి చూసే పరిస్థితినుంచి ఉద్యోగాలు  ఇచ్చే స్థితికి యువతను ప్రోత్సహిస్తున్నారు మన మోదీ గారు.  22 అక్టోబర్ 2022 నాడు దేశ యువతకు దీపావళి కానుకగా ‘రోజ్ గార్ మేళా’ను ప్రధానమంత్రి ప్రారంభించారు.  ప్రతి నెల 50నుంచి 70వేల మంది చొప్పున యువతకు అపాయింట్మెట్లు అందజేస్తూ ఈ మేళాను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తోంది.

8th National Career Fair
8th National Career Fair

ఇది 8వ రోజ్గార్ మేళా, ఇవాళ్టి కార్యక్రమంతో కలుపుకుని మొత్తంగా 5.5 లక్షలకు పైగా మందికి అపాయింట్మెంట్ లెటర్లు అందించామన్నారు. మిగిలిన లక్ష్యాన్ని కూడా నిర్దేశిత సమయంలో చేరుకుంటాం. గతంలో ఉద్యోగాలంటే రికమండేషన్ ఉంటేనే వచ్చేది.. కానీ ఇవాళ రికమండేషన్ అవసరం లేకుండా.. టాలెంట్ ఉంటే ఉద్యోగం మీదే అన్నట్లుగా ఉంది పరిస్థితి.  సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి అధునాతన సాంకేతికను విద్యావిధానంలోకి తీసుకొచ్చింది. అదే సమయంలో నెప్ -2020 ద్వారా విద్యావిధానంలో నైతికతకు, సృజనాత్మకతకు పెద్దపీట వేసిందని అన్నారు. ఇలా ఈ తొమ్మిదేళ్లలో చాలా మార్పులు వచ్చాయి. వచ్చే 25 ఏళ్ల అమృతకాలంలో.. మీరు మరింత శ్రమించి పనిచేస్తే..  భారతదేశాన్ని మళ్లీ ‘విశ్వగురు’గా పనిచేయడం మరింత సులువు అవుతుంది. ఈ దిశగా మీ సహకారాన్ని ఆశిస్తూ. మరోసారి మీకు, మీ కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!