10 C
New York
Thursday, April 18, 2024

 రేవంత్ రిటర్న్ గిఫ్ట్…

- Advertisement -

 రేవంత్ రిటర్న్ గిఫ్ట్…
వరంగల్, మార్చి 20
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బాటలో పయనిస్తున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో నాటి టీఆర్‌ఎస్‌ 63 స్థానాల్లో గెలిచింది. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే మెజారిటీకి కొన్ని సీట్లే ఎక్కువ రావడం, ప్రతిపక్షాలు బలంగా ఉండడంతో కేసీఆర్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌ మొదలు పెట్టారు. టీడీపీ, కాంగ్రెస్‌తోపాటు సీసీఐ ఎమ్మెల్యేను కూడా టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. ప్రతిపక్షాలను బలహీన పర్చారు. నాడు ప్రభుత్వం బలంగా ఉండేందుకు అలా చేశారని అంతా భావించారు.2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్‌ ఈసారి మంచి మెజారిటీ సాధించారు. 87 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ను ప్రజలు గెలిపించారు. అయినా కేసీఆర్‌ ప్రతిపక్షం బలంగా ఉండొద్దని, తనను ప్రశ్నించే వాడు ఉండకూడదన్న భావనతో మరోమారు ఆపరేషన్‌ ఆకర్ష చేపట్టారు. కాంగ్రెస్‌ 19 స్థానాలు గెలవగా 12 మందిని లాక్కుని సీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేసినట్లు ప్రకటించారు. దీనిపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. దళితుడు అయిన భట్టి విక్రమార్క ప్రతిపక్ష నేత కావడంతో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా ఉండకూడదన్న కుట్రతో కేసీఆర్‌ ఇలా చేశారన్న విమర్శలు వచ్చాయి.2014, 2018లో కేసీఆర్‌ చేసిన విధంగానే ఇప్పుడు సీం రేవంత్‌రెడ్డి కూడా చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 64 సీట్లు వచ్చాయి. మెజారిటీ మార్కుకన్నా 4 ఎక్కువ వర్చాయి. బీఆర్‌ఎస్‌కు 39, బీజేపీకి 8, ఎంఐఎంకు 7 స్థానాలు దక్కాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అధికారం చేపట్టిన నాటి నుంచే ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ రేవంత్‌ సర్కార్‌ త్వరలో కూలిపోతుంది అని భయపెడుతోంది. కేటీఆర్, హరీశ్‌రావు పదేపదే శాపనార్థాలు పెడుతున్నారు. బీజేపీ కూడా పార్లమెంటు ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ఏర్పడుతుందని పేర్కొంటోంది. దీంతో రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ నేతల మాటలను సీరియస్‌గా తీసుకున్నారు. తాను గేట్లు ఎత్తితే బీఆర్‌ఎస్‌లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు తప్ప ఎవరూ మిగలరని ప్రకటించారు. వంద రోజుల పాలన తర్వాత ఇక పీసీసీ చీఫ్‌గా తన రాజకీయం చూపిస్తానని తెలిపారు. రేవంత్‌రెడ్డి ఒక గేటు ఎత్తినట్లు ప్రకటించిన కాసేపటికే ఖైతరాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవె ళ్ల సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. త్వరాలో మరో ఏడుగురు కాంగ్రెస్‌లో చేరతారని తెలుస్తోంది.గడిచిన మూడునెలలుగా 10 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. దీంతో అప్పటి నుంచే వారు కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరుగుతోంది. అయితే దానంతో చేరికల ప్రక్రియ మొదలైంది. త్వరలో కొత్త ప్రభాకర్‌రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, తెల్లం వెంకటరావు, ప్రకాశ్‌గౌడ్, కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డి, మాణిక్‌రావు ఇప్పటికే రేవంత్‌తో భేటీ అయ్యారు. వీరి చేరికపై చర్చలు కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది. చేరిక మాత్రమే మిగిలిందని తెలుస్తోంది.బీఆర్‌ఎస్‌ నేతలు తరచుగా రేవంత్‌ సర్కార్‌ పడిపోతుందని వ్యాఖ్యానిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల ముందు ఈ ప్రచారం ఎక్కువైంది. టిట్‌ ఫర్‌ టాట్‌ అన్నట్లుగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను చీల్చే ప్రక్రియ చేపట్టారు రేవంత్‌రెడ్డి. వీలైటే మెజారిటీ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను చేర్చుకుని బీఆర్‌ఎస్‌కు ప్రతిపక్ష హోదా పోగెట్టాలన్న వ్యూహంతో సీఎం రేవంత్‌ ఉన్నట్లు తెలుస్తోందిదానం నాగేందర్‌ కాంగ్రె స్‌లో చేరడంతో బీఆర్‌ఎస్‌ అలర్ట్‌ అయింది. ఈ క్రమంలో సోమవారం స్పీకర్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని కోరనున్నట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ ఎన్నిసార్లు ప్రయత్నించినా అనర్హత వేటు పడదని అందరికీ తెలుసు. ఎందుకంటే కేసీఆర్‌ హయాంలో జరిగిన ఫిరాయింపులపై అనర్హత వేటుకు కాంగ్రెస్‌ ఎన్ని ఫిర్యాదులిచ్చినా అప్పటి స్వీపకర్‌ పట్టించుకోలేదు. ఆ ధైర్యంతోనే కాంగ్రెస్‌ ఇప్పుడు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఫిరాయింపును ప్రోత్సహిస్తోంది.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!