Breaking News
Saturday, July 27, 2024
Breaking News

గ్రేటర్ లో పట్టు ఎవరిది

- Advertisement -

గ్రేటర్ లో పట్టు ఎవరిది

హైదరాబాద్, మే 8,

విశ్వనగరం హైదరాబాద్, రాష్ట్రంలో మూడవ వంతు జనాభా, కోటికి పైగా ఓటర్లు, 24 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాలు, అన్ని రాష్ట్రాల ప్రజలు ఉండే ఓ మినీ భారతం. తెలంగాణలో కీలకమైన గ్రేటర్ పై పట్టు సాధించడానికి అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం నగరంలో రాజకీయ పరిణామాలు మారాయి. అధికార మార్పు నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో గ్రేటర్ వాసులు ఎవరిని ఆదరిస్తారు ? ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో.. అన్నది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మరింది.గతంలో భాగ్యనగరంలో మూడు ప్రధాన పార్టీలకు సమానమైన బలాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పలువురు ముఖ్య నేతలు, కార్పొరేటర్లు, ద్వితీయ శ్రేణి లీడర్లు హస్తం కండువా కప్పుకుంటున్నారు. దీంతో కాంగ్రెస్ బలం పెరిగింది. ఈ నేపథ్యంలోనే బలమైన అభ్యర్థులను గెలుపు బరిలో దింపిన కాంగ్రెస్ భారీ విజయం కోసం వ్యూహాలు రచిస్తోంది.క్షేత్రస్థాయి ప్రచారంతో పాటు వ్యాపారులు, ఐటీ ఉద్యోగులు, కాలనీ సంఘాలు, డ్రైవర్లతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాలతో ఎవరి పంథాలో వారు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రేటర్‌లో పట్టు పెంచుకునేందుకు ఎమ్మెల్యే దానం నాగేందర్ ను కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ నుంచి బరిలో దింపింది. ఇటీవల హస్తం గూటికి చేరిన మాజీమంత్రి పట్నం మహేందర్ రెడ్డి సతీమణి సునీతారెడ్డి మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తున్నారు.మల్కాజ్ గిరి నుంచి బీఆర్‌ఎస్ కు చెందిన పలువురు నేతలు పార్టీలో చేరడంతో స్థానికంగా పార్టీ బలపడుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లో నగర ఓటర్లు తమకు అనుకూలంగా ఉంటారని బీజేపీ బలంగా విశ్వసిస్తోంది. బీజేపీ విజయానికి మోదీ మానియా కృషి చేస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇలా ఎవరి ధీమా వారిదే అన్నట్లు పార్టీల నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మరి గ్రేటర్ ఓటర్లు ఎవరి వైపు ఉంటారో వేచి చూడాల్సిందే.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!