- Advertisement -
దిల్లీ: ఎల్‌నినో పరిస్థితులు కొనసాగే సూచనలు ఉన్నందున ఈ ఏడాది వేసవి ప్రారంభం నుంచే ఉష్ణోగ్రతలు మోతెక్కనున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం వెల్లడించింది. తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో సాధారణం కంటే అధికంగా వడగాలులు ఉంటాయని అంచనా వేసింది. మార్చి నుంచి మే దాకా సాధారణం కంటే అధిక గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఎల్‌నినో, మధ్య పసిఫిక్ మహాసముద్రంలో నీటి ఆవర్తనం వేడెక్కడం వంటి పరిస్థితులు వేసవికాలం పొడవునా కొనసాగుతాయని, ఆ తర్వాత సాధారణ స్థితికి చేరుకుంటాయని వెల్లడించారు. దేశంలో అనుకూల వర్షపాతానికి కారణమైన లానినా పరిస్థితులు వర్షాకాలం మధ్య నుంచి ఏర్పడనున్నట్లు అంచనా వేశారు……
- Advertisement -