Breaking News
Saturday, July 27, 2024
Breaking News

అమూల్‌ పాల ధరలు పెరిగాయి.

- Advertisement -

దిల్లీ: అమూల్‌ పాల ధరలు పెరిగాయి. అన్ని రకాలపై పెంపు వర్తించనున్నట్లు ‘అమూల్‌’ బ్రాండ్‌తో డెయిరీ ఉత్పత్తులను విక్రయిస్తున్న ‘గుజరాత్‌ కో-ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ’ ఆదివారం రాత్రి ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఒక్కో లీటర్‌ పాలపై రూ.2 వరకు పెంచుతున్నట్లు వెల్లడించింది. చివరిసారి అమూల్‌ 2023 ఫిబ్రవరిలో ధరలను సవరించింది.
పెరిగిన ధరలు సోమవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయి. పాల ఉత్పత్తి, నిర్వహణ వ్యయాలు పెరిగిన కారణంగానే ధరల్ని సవరించాల్సి వస్తోందని GCMMF తెలిపింది. తమ అనుబంధ పాల సంఘాలు రైతులకిచ్చే పరిహారాన్ని గత ఏడాది వ్యవధిలో 6-8 శాతం పెంచినట్లు పేర్కొంది. తాజా పెంపు వల్ల వారికి మరింత మెరుగైన ధర కట్టిచ్చేందుకు అవకాశం లభిస్తుందని వివరించింది. తద్వారా అధిక పాల ఉత్పత్తిని ప్రోత్సహించినట్లవుతుందని అభిప్రాయపడింది.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!