Breaking News
Saturday, July 27, 2024
Breaking News

ప్రజలను మోసం చేస్తున్న ముఠా అరెస్ట్

- Advertisement -

ప్రజలను మోసం చేస్తున్న ముఠా అరెస్ట్

ఏసీపీ దామోదర్ రెడ్డి

సీఐ రఘుపతిరెడ్డి

ప్రజలను మోసగించేందుకుగాను దొంగలు ఎన్నో ఎత్తుగడలు వేస్తు పథకం ప్రకారం దోచుకుంటున్నారు… ఇలా ఎత్తుగడలు వేసి మధ్యలోనే పోలీసులకు దొరికిపోవడంతో వారి గుట్ట రట్టయిన సంఘటన జనగామ జిల్లాలో జిల్లాల జరిగింది. సంఘటనకు సంబంధించిన ఏసీపీ దామోదర్రెడ్డి తెలిపిన వివరాల మేరకు ఇలా ఉన్నాయి.. జనగామ మండలం పెంబర్తి వద్ద జనగామ ఎస్ఐ సృజన్, వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానితంగా ఉన్న ఒక ఆటోలోని వ్యక్తులను పట్టుకొని విచారించారు. తనిఖీల్లో వారి దగ్గర నుంచి ఒక ఇనుప పెట్టె లభ్యంమై నట్లు తెలిపారు. ఈసందర్భంగా పోలీసులు పెట్టెగురించి వారు వేసిన ఎత్తుగడల గురించి వారి పద్ధతిలో ఆరా తీయగా సదరు ఇనుప పెట్టెను విక్రయించడానికి వెళ్తున్నట్లు ఒప్పుకున్నట్లు ఈ పెట్టె ఆకాశం నుంచి ఉల్కలు తెగిపడినప్పుడు దొరికిందని ఈ అద్భుతమైన పెట్టే ఎవరి వద్ద ఉంటే వారు కోటీశ్వరులు అవుతారని ప్రజలను నమ్మించి దానిని 50 కోట్ల దర చెప్పి 5 నుండి 10 కోట్లకు విక్రయించేందుకు వెళుతున్నట్లు తెలిపారు అన్నారు ప్రజలు ఇలాంటి మాయ మాటలు నమ్మవద్దని చిన్న సాంకేతికత ఉపయోగించి పెట్టెలో నుంచి నిప్పు రవ్వలు చిమ్మే విధంగా
తయారు చేశారని, ఇది చూసిన అమాయక ప్రజలు నమ్ముతుంటారని, ఇలాంటి వారిపట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఏసీపీ కోరారు. కాగా, నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సీఐ రఘుపతిరెడ్డి, ఎస్ఐ నృజన్, కానిస్టేబుల్ కర్ణాకర్, రామన్న సాగర్, అనిల్ కుమార్ ను డీసీపీ సీతారాం, ఏసీపీ దామోదర్రెడ్డి అభినందించారు.

వరంగల్ కమిషనరేట్ కు చెందిన టాస్క్ ఫోర్స్ పోలసులు నిందితులను పట్టుకొని కేసును జనగామ పోలీసులకు అప్పగించినట్టు సమాచారం…❗

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!