Breaking News
Friday, July 26, 2024
Breaking News

తెలంగాణలో వైన్స్‌ దుకాణాలు బంద్‌..

- Advertisement -

మరోసారి తెలంగాణలో మద్యం క్రయవిక్రయాలు బంద్‌ కానున్నాయి. ఇటీవల ఎన్నికలు, హోలీ సంబరాల నేపథ్యంలో వైన్స్‌ బంద్‌ ఉండగా ఇప్పుడు శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా మద్యం దుకాణాలు మూసివేస్తున్నారు.

24 గంటల పాటు మద్యం విక్రయాలపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. పవిత్ర శ్రీరామనవమి ఉత్సవం సందర్భంగా తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది.

రామయ్య కల్యాణానికి ‘కోడ్‌’ అడ్డంకి.. ప్రత్యక్ష ప్రసారానికి నిరాకరణ

హిందూవుల అత్యంత పర్వదినం శ్రీరామనవమి. ఈనెల 17వ తేదీన శ్రీరామ నవమి ఉత్సవాలు జరుగనున్నాయి. దేశవ్యాప్తంగా రామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. పవిత్రమైన రోజు కావడంతో ఆరోజు మద్యం దుకాణాలు మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పర్వదినం పురస్కరించుకుని రాష్ట్రంలోని కీలక ప్రాంతాల్లో శోభాయాత్రలు కూడా జరుగుతుంటాయి. ఎలాంటి వివాదాస్పద సంఘటనలు, అల్లర్లు చెలరేగకుండా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ప్రభుత్వం మద్యం దుకాణాలు మూసివేయనుంది. అయితే మద్య నిషేధం కేవలం హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ పరిధిలోనే విధించారు. రాష్ట్రవ్యాప్తంగా దుకాణాలు తెరిచే ఉండనుండడం గమనార్హం.

 బెల్లం పానకం, వడపప్పులు చేసేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయోద్దు..

శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నగరాల పరిధిలోని మద్యం దుకాణాలు పూర్తి మూసివేయాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. మద్యం దుకాణాలు, రెస్టారెంట్లు, బార్లు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. శాంతిభద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈనెల 17న ఉదయం 6 నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, రెస్టారెంట్లలో మద్యం, కల్లు దుకాణాలు మూతపడనున్నాయి.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!