Breaking News
Saturday, July 27, 2024
Breaking News

తెలంగాణలోనూ బెట్టింగ్

- Advertisement -

తెలంగాణలోనూ బెట్టింగ్
హైదరాబాద్ , మే 22 (వాయిస్ టుడే)
రాష్టంలో బెట్టింగ్‎ల సీజన్ నడుస్తోంది. అవి IPL బెట్టింగ్‎లు అనుకుంటే మీరు పప్పులే కాలేసినట్టే. మెదక్, జహీరాబాద్ స్థానాలపై పందెం రాయుళ్లు జోరుగా బెట్టింగ్ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఇప్పుడు కొంత మంది బెట్టింగ్ క్రికెట్ కోసం కాకుండా ఎక్కడ ఏ పార్టీ గెలుస్తుందని తెగ పందేలు కాస్తున్నారు. అవును ఇప్పుడు ఇలాంటి బెట్టింగులే ఎక్కువ నడుస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొన్న జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే చర్చ బాగా జరుగుతుంది. గెలుపు గుర్రాలపై బెట్టింగులు కాస్తున్నారు. మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ స్థానాలు ఎప్పుడు హాట్ టాపిక్‎గా మారాయి. ఈ స్థానాల్లో గెలిచే గెలుపు గుర్రలపై రాజకీయ నేతలే కాకుండా.. సామాన్య ప్రజానీకం కూడా లక్షల్లో బెట్టింగ్ కాస్తున్నారు. రాష్ట రాజకీయాలలో ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి. ఏ రాజకీయ విశ్లేషకుడు కూడా ఈ స్థానాలపై ఖచ్చితమైన వివరణ ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. ఇక్కడి ప్రజలు కూడా ఎప్పుడు ఎలాంటి తీర్పు ఇస్తారో ఎవ్వరికి అంతుచిక్కని పరిస్థితి నెలకొంది. అందుకే రాష్టంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అందరి చూపు ఉమ్మడి మెదక్ జిల్లా వైపే వుంటుంది. ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి మెదక్ పార్లమెంట్ స్థానం1952 లో ఏర్పాడింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానం 2002లో డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఏర్పాటై 2008లో ఉనికిలోకి వచ్చింది.1980లో మెదక్ పార్లమెంట్ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున శ్రీమతి ఇందిరాగాంధీ పోటీ చేసి గెలుపొందగా.. 2009లో జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన సురేష్ షెట్కార్ గెలుపొందారు. అప్పటి నుంచి ఈ రెండు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారాయి.కానీ గత పది సంవత్సరాలుగా ఆ కంచుకోటను బీఆర్ఎస్ పార్టీ ఆక్రమించుకుంది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో సీన్ మారింది. ఈ రెండు స్థానాల్లో గెలుపొందలని కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో కృషి చేసింది. బీజేపీ కూడా అంతే స్థాయిలో వర్క్ అవుట్ చేసింది. గతంలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు అందరు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో.. మిగిలిన పార్టీలు కూడా ఈ స్థానాలను సీరియస్‎గా తీసుకున్నారు. ఈ స్థానాలు రాష్టంలోనే ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ప్రస్తుతం మెదక్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ నుండి నీలంమధు, బీజేపీ నుండి రఘునందన్ రావు, బీఆర్ఎస్ నుండి వెంకట్ రామ్ రెడ్డి పోటీ చేయగా.. ఇక జహీరాబాద్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ నుండి సురేష్ శేట్కర్, బీజేపీలో బీబీ పాటిల్, బీఆర్ఎస్ నుండి గాలి అనిల్ కుమార్ పోటీ చేశారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్ని పార్టీలు తమ అభ్యర్థులను గెలిపించడానికి బాగా కష్ట పడ్డాయి. ఆయ పార్టీలకు సంబంధించిన ఇతర రాష్టాల నేతలను సైతం తీసుకువచ్చి ప్రచారం చేయించడం ద్వారా ఇక్కడి ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. మే 13న ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరిగాయి. ఇదంతా ఒక వైపు అయితే, మరో వైపు తామే గెలుస్తాము అన్న విశ్వాసం రాజకీయ నాయకుల నుండి కార్యకర్తల వరకు, సామాన్య జనం కూడా ఈ రెండు స్థానాలపై లక్షల్లో పందేలు కాస్తున్నారు. ఒకరు డబ్బులతో పందేలు కాస్తుంటే.. మరికొందరు తమ స్థిరచర ఆస్తులను సైతం పందేల్లో పెడుతున్నారని సమాచారం. ఈ ఉత్కంఠకు తెర పడాలంటే ఇంకో 10రోజులు వేచి చూడాల్సిందే.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!