సి.సి రోడ్డు పనులను పర్యవేక్షించిన కాంగ్రెస్ నేత నాయకులు జువ్వాడి కృష్ణారావు
కోరుట్ల
మండలం లోని ఐలాపూర్, పైడిమడుగు, జోగన్ పల్లి గ్రామాలలో సి.సి రోడ్డు పనులను సోమవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు పరిశీలించారు.ఈసంధర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తోనే కోరుట్ల నియోజక వర్గం అభివృద్ధి పథంలో నడుస్తుందని అన్నారు. నాణ్యతతో పనులు చేపట్టాలని కాంట్రాక్టర్ కు సూచించారు సకాలంలో పనులు పూర్తి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొంతం రాజం, నియోజక వర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి, నాయకులు
పన్నాల అంజిరెడ్డి సంజీవ రెడ్డి,పెరుమండ్ల సత్యనారాయణ,
తాటికొండ బాబు, సహదేవ్, జనార్ధన్, తేలు రాజ్ కుమార్, మ్యకల రాకేష్ పాల్గొన్నారు.