సైక్లింగ్ టు వోట్ – వాక్ టు వోట్ పేరుతో వాక్తన్
మాదాపూర్: బుధవారం నాడు హైదరాబాద్ దుర్గం చెరువుపై సైక్లింగ్ వాక్తన్ నిర్వహించారు. సైక్లింగ్ టు వోట్ – వాక్ టు వోట్ పేరుతో వాక్తన్ జరిగింది. ఈ కార్యక్రమంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా రాజీవ్ కుమార్, కమిషనర్లు అరుణ్ గొయల్ అనూప్ చంద్ర పాండ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్, సైబరాబాద్ సీపీ స్టిపెన్ రవీంద్ర, అధికారులు తదితరులు హజరయ్యారు. సైక్లిస్ట్ లు, వాకర్స్ భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలనే అవగాహన కార్యక్రమం నిర్వహిచారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ముందు విద్యార్దులు ఓటు హక్కు వినియోగించుకోవాలని నాటకం ద్వారా చేసి చూపించారు అయన సైక్లిస్ట్ లతో ముచ్చటించారు. ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు.