iQOO Z9 5G పై తగ్గింపు.. ఇప్పుడే త్వరపడండి..
కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారా?..కానీ, మీరు ఏది కొనాలో కన్ఫ్యూషన్ లో ఉన్నారా? అయితే, ఈ ఆఫర్ మీ కోసమే. iQOO Z9 5Gని స్మార్ట్ ఫోన్ పై ఆఫర్ ఉంది. ఈ ఫోన్ అసలు ధర రూ.19,999 నుండి ప్రారంభమవుతుంది. అయితే, డిస్కౌంట్ పోను ఈ ఫోన్ ని ఎంతకు కొనుగోలు చేయొచ్చో, ఫీచర్స్ మొదలైనవి ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
iQOO Z9 5G స్మార్ట్‌ఫోన్ 8GB + 128GB వేరియంట్ ధర రూ. 19,999 కాగా, 8GB + 256GB వేరియంట్ రూ. 21,999 గా ఉంది. కానీ బ్యాంక్ ఆఫర్‌ల తర్వాత బేస్ వేరియంట్ ప్రభావవంతమైన ధర రూ. 17,999 గాను టాప్ వేరియంట్ ధర రూ. 19,999 గాను లభిస్తోంది. దీని ప్రకారం చూస్తే..రెండు స్మార్ట్‌ఫోన్‌లు రూ. 2000 తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. ఈ తగ్గింపును పొందడానికి, మీరు SBI/ICICI క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేయాలి. EMI ఎంపికతో కూడా ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
స్పెసిఫికేషన్‌లు
iQOO Z9 5G 6.67-అంగుళాల AMOLED డిస్ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, 2400 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వస్తుంది. దీని పిక్సెల్ సాంద్రత 394 PPI. పనితీరు కోసం MediaTek Dimension 7200 Soc చిప్‌సెట్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయబడింది. ఇది LPDDR4x RAM మరియు UFS 2.2 నిల్వతో జత చేసారు.ఇక ఫోన్ వెనుక ప్యానెల్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా (OIS), 2MP డెప్త్ సెన్సార్ అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరాను కూడా అందించారు. బ్యాటరీ, ఛార్జింగ్ గురుంచి మాట్లాడితే..శక్తిని అందించడానికి 44 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5000 mAh బ్యాటరీ అందించబడింది. ఇది బ్లూటూత్ 5.3, USB టైప్-సి పోర్ట్, ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ కలిగి ఉంది.ఈ ఫోన్ బ్రష్డ్ గ్రీన్, గ్రాఫేన్ బ్లూ కలర్ ఆప్షన్‌లతో లభిస్తోంది.