Breaking News
Saturday, July 27, 2024
Breaking News

కాంగ్రెస్ వచ్చాక నిత్యావసర వస్తువుల ధరల కొండెక్కాయి

- Advertisement -

కాంగ్రెస్ వచ్చాక నిత్యావసర వస్తువుల ధరల కొండెక్కాయి
కరీంనగర్
కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కి మద్దతుగా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కంపేటలో ఎన్నికల ప్రచారంలో మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గోన్నారు.
హరీష్ రావు మాట్లాడుతూ ఈ ఎన్నిక తెలంగాణ భవిష్యత్తును, తలరాతను మార్చే ఎన్నిక. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని చేయడానికి చంద్రబాబు లాంటి వాళ్లు కుట్ర చేస్తున్నారు.వాళ్ల ఆటలు సాగకూడదనుకుంటే బీఆర్ఎస్’ను గెలిపించాలి. ఆరు గ్యారంటీల్లో ఒకటే అమలు చేసి ఐదు అమలు చేశామని అబద్ధం చెబుతున్నారు. అన్నవస్త్రం కోసమే ఉన్న వస్త్రం పోయినట్టు అయింది. చెక్ బౌన్స్ అయితే శిక్ష పడుతుంది. కాంగ్రెస్ బాండు పేపర్లు బౌన్స్ అయ్యాయి. కాంగ్రెస్ కు శిక్ష పడాలి.  రేవంత్ ఇప్పుడు సిగ్గులేకుండా దేవుడిపై ఒట్టు పెట్టి మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ వచ్చాక నిత్యావసర వస్తువుల ధరల కొండెక్కాయి. మంచినీళ్లు వస్తలేవు. పింఛన్లు వస్తలేవు. కేసీఆర్ తెచ్చినవన్నీ తీసేస్తున్నారు. కాంగ్రెస్ వచ్చాక అన్నీ గోవిందా గోవిందా పాటలా మారాయి.  దళిత బంధు, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి పింఛను అన్నీ గోవిందా. మహాలక్ష్మి గ్యారంటీ మహా మోసం. మీరు వినోదన్నను గెలిపిస్తే కాంగ్రెస్ మెడలు వంచి హామీలను అమలు చేస్తాం.  వినోదన్న అభివృద్ధి సాధకుడు. బండి సంజయ్ ఐదేళ్లలో కరీంనగర్కు ఏం చేశాడు? బీజేపీ పదేళ్ల పాలనలో పప్పు ఉప్పు ధరలు పెరిగాయి. కేసీఆర్ తెలంగాణకు శ్రీరామ రక్ష. సాగునీళ్లు, మెడికల్ కాలేజీలు, నిరంతర కరెంటు, కేసీఆర్ కిట్టు.. ఎన్నో సంక్షేమ పథకాలు అమలయ్యాయి.  కాంగ్రెస్ అడ్డుకున్నా పట్టుబట్టి గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేశామని అన్నారు.
కాంగ్రెస్ వచ్చాక అంతా రివర్స్ అయింది. కరెంటు మీటర్లు కాలిపోతున్నాయి. రిపేరుకు పదివేలు ఖర్చవుతోంది.  గిరిజనులకు కేసీఆర్ పోడు పట్టాలిచ్చుండు. రేవంత్ చేసిందేమీ లేదు. గుంపు మేస్త్రీకి మాటలెక్కువ, చేతులు తక్కువ. గుంపు మేస్త్రీ గూబ పలకాలంటే కారు గుర్తుకు నొక్కాలి. ఎవరు మనకు మేలు చేశారో వాళ్లను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ముసలోళ్లు కేసీఆర్ ఇచ్చిన కంటివెలుగు కళ్లద్దాలు పెట్టుకుని మూడో నంబరు బటన్ నొక్కాలని అన్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!