Breaking News
Saturday, July 27, 2024
Breaking News

రాయల్ ఎన్‌ఫీల్డ్‌తో నేరుగా పోటీపడుతున్న జావా కొత్త వేరియంట్ బైక్..!

- Advertisement -

రాయల్ ఎన్‌ఫీల్డ్‌తో నేరుగా పోటీపడుతున్న జావా కొత్త వేరియంట్ బైక్..!

జావా యెజ్డీ మోటార్‌సైకిల్స్ ఇప్పుడు భారతదేశంలో తన ఫ్లాగ్‌షిప్ బైక్ జావా పెరాక్‌ని సరికొత్త స్టీల్త్ డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌తో
మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పుడు అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణం కోసం కొత్త పెరాక్‌లో కొన్ని కొత్త ఫీచర్లు చేర్చారు. ఈ బైక్‌తో పాటు కంపెనీ జావా 42 బాబర్ మొత్తం శ్రేణి ధరలను కూడా అప్డేట్ చేసింది. జావా పెరాక్ అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లలో ఒకటని, దాని కొత్త డిజైన్ కస్టమర్లను మరింత ఆకర్షిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ రెండు బైక్‌ల ఫీచర్లు, ధర గురించి ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

ఇంజిన్

జావా పెరాక్ బైక్ లో 334సీసీ ఇంజన్ కలదు. ఈ బైక్ 29.9పీఎస్ పవర్ ఉత్పత్తి చేస్తుంది. బైక్ ముందువైపు 280ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్, వెనుకవైపు 240ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ సదుపాయం కలదు. అంతే కాకుండా డ్యూయల్ ఛానల్ ABS, అసిస్ట్, స్లిప్ క్లచ్, కొత్త సెవెన్ స్టెప్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ వంటి ఫీచర్లు బైక్‌లో కనిపిస్తాయి. జావా బైక్‌లు డిజైన్‌తో పాటు పవర్‌ఫుల్ ఇంజన్ కలిగి ఉన్నప్పటికీ నాణ్యత పరంగా అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. కంపెనీ దీనిపై కూడా శ్రద్ధ చూపుతుందని కస్టమర్లు ఆశిస్తున్నారు.
అంతే కాకుండా జావా పెరాక్ క్రాఫ్టెడ్ బ్రాస్ ట్యాంక్ బ్యాడ్జింగ్, ఫ్యూయెల్ ఫిల్లర్ క్యాప్ కూడా ఇందులో కనిపించడం వల్ల ఈ బైక్ మరింత మెరుగ్గా కనిపిస్తుంది. రైడర్ సౌలభ్యం కోసం ఈ బైక్‌లో క్లాసిక్ స్టైల్ టాన్ సీట్ అలాగే ఫార్వర్డ్ ఫుట్ పెగ్‌లు అందించారు.

ధర

జావా పెరాక్ ఎక్స్-షో రూమ్ ధర రూ.2,13,187 గా ఉంది. కాగా, జావా 42 బాబర్ ధర రూ.2,09,500 నుంచి రూ.2,29,500 వరకు మార్కెట్లో దొరుకుతోంది. ఈసారి జావా కొత్త పెరాక్‌లో స్ట్రైకింగ్ స్టెల్త్ మ్యాట్ బ్లాక్, మ్యాట్ గ్రే డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. అయితే ఈ బైక్ నేరుగా రాయల్ ఎన్‌ఫీల్డ్‌తో పోటీపడుతోంది.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!