రోజు రోజుకు పెరుగుతున్న సోమారపు ప్రజల మద్దతు…!
పెద్దపల్లి జిల్లా: నవంబర్. 2 (వాయిస్ టుడే) గోదావరిఖని
సోమారపు సత్యనారాయణ గెలుపే లక్ష్యంగా సోడాల వర్తక సంఘం కుటుంబ సభ్యులు 500 మంది పూర్తిస్థాయి మద్దతు..
ఈ రోజు స్థానిక మేదరి బస్తి శ్రీనివాస హాల్లో జరిగిన సోడాల సంఘం ఆత్మీయ సమ్మేళనంలో. ఆత్మీయంగా సోమారపు సత్యనారాయణ ని ఆహ్వానించినారు. ఈ కార్యక్రమంలో సోమారపు సత్యనారాయణ ని. సోడాల సంఘం ముఖ్య సలహాదారు బండారి రాజమల్లు ఘనంగా సన్మానించినారు. అధ్యక్షులు బైరి శ్రీనివాసు. ప్రధాన కార్యదర్శి. దాసరి శ్రీనివాస్. తాటిపాముల బిక్షపతి. ఆడెపు రాజేందర్ గోనే ఆశాలు రాజేందర్. పద్మశాలి సేవా సంఘం ప్రధాన కార్యదర్శి బుర్ల దామోదర్. మాజీ అధ్యక్షులు మంచి కట్ల బిక్షపతి . తమ ఓటు తో పాటు తమ కుటుంబ సభ్యుల ఓట్లు. రామగుండం కార్పొరేషన్ ప్రాంతంలోని ప్రజల మద్దతు ఇచ్చే విధంగా వారు ప్రచార హోరు సాగిస్తామని ఈ సందర్భంగా సోమారపు సత్యనారాయణ కి హామీ ఇవ్వడం జరిగింది. గతంలో సోమారపు సత్యనారాయణ చేసినటువంటి సేవలకు వారు కొనియాడినారు. రేపు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించుటకు కృషి చేస్తామని వారందరూ హామీ ఇవ్వడం జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనం లో సోడాల సంగం కుటుంబ సభ్యులు 500 మంది పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.