Breaking News
Friday, July 26, 2024
Breaking News

ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి ధర్మపురి అరవింద్

- Advertisement -

ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి ధర్మపురి అరవింద్

జగిత్యాల్ జిల్లా కి నవోదయ పాఠశాల మంజూరు.
వాయిస్ టుడే : మెట్ పల్లి/ ఇబ్రహీంపట్నం ప్రతినిధి నవంబర్:06

జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని మెట్ పల్లి పట్టణంలో సోమవారం భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపి ధర్మపురి అరవింద్ అయ్యప్ప దేవాలయం నుండి బస్ డిపో వరకు రోడ్డుషో నిర్వహించారు. అవినీతి రహిత పాలన కోసం బీజేపీకి ఓటేయ్యాలని ప్రజలను కోరారు. బి ఆర్ ఎస్ నాయకులు ప్రతి పనిలో అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతికి లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ భలైందన్నారు.కల్వకుంట్ల కుటుంబం ప్రతి పనిలో కమిషన్లు తీసుకొంటూ రాష్టాన్ని అప్రతిష్టపాలు చేసిందన్నారు. పరీక్షల పేపర్లు అమ్ముకొని నిరుద్యోగుల జీవితాలతో చాలగటం ఆడుతున్నారన్నారు. కల్వకుంట్ల కవిత లిక్కర్ దందలో అడ్డంగా దొరికి తెలంగాణ పరువుతిసిందన్నారు. మహిళా లోకానికి మాయని మచ్చగా మారిందని ఏద్దేవా చేసారు.ఇలాంటి అవినీతి కమిషన్ల కల్వకుంట్ల కుటుంబాన్ని రాజకీయంగా సమాధి చేయాలన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే గల్ఫ్ కార్మికులకోసం గల్ఫ్ సంక్షేమ శాఖ ను ఏర్పాటు చేస్తామన్నారు.బీడీ కార్మికులకోసం శ్వాసకు సంబందించిన ఆసుపత్రిని కోరుట్లలో ఏర్పాటు చేయిస్తానన్నారు. జగిత్యాల జిల్లాకి నవోదయ పాఠశాల మంజూరు అయ్యిందని, కేంద్రియ విద్యాలయాన్ని కూడా మంజూరు చేయిస్తానని మాటిచ్చారు.40ఏండ్ల పసుపు బోర్డు కలను నెరవేర్చిన ఘనత ప్రధాని మోడీ దేనని అన్నారు. బిజెపిని గెలిపిస్తే మూతబడ్డ చక్కర కర్మాగారాన్ని కూడా తెరిపిస్తామని మాటిచ్చారు.దేశంలో అవినీతిరహిత ప్రభుత్వం ఉందని, రాష్ట్రంలో కూడా అవినీతిరహిత ప్రభుత్వం రావాలని, అది బిజెపితోనే సాధ్యమన్నారు.బి ఆర్ ఎస్ నాయకులు కేసీఆర్ ఓడిపోతే పెన్షన్ లు రావని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, బీజేపీ వస్తే పెన్షన్ లతో పాటు పేదలకు ఇండ్లుకూడా వస్తాయన్నారు. మళ్లీ రాబోయే ఐదు సంవత్సరాల వరకు ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వమేనని అన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు కిలో బియ్యం ఇచ్చి ప్రజలను మోసం చేస్తుందని దానికి తోడుగా కొత్తగా సన్న బియ్యం ఇస్తామనడం సిగ్గుచేటనే అన్నారు. ఈ కార్యక్రమంలో జంగిడి సునీత సురభి నవీన్ సుఖేందర్ గౌడ్ ఆకుల లింగారెడ్డి బిజెపి నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!