మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మళ్లీ వైసీపీలోకి రీఎంట్రీ ఇవ్వనున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
కొద్దిరోజుల క్రితం ఏపీ రాజకీయాల్లో అంబటి రాయుడు హడావిడి కనిపించింది. ఆయన కొంతకాలంగా ఏపీలో అధికారంలోకి ఉన్న వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతూ వచ్చారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రశంసలు కురిపించారు.
దీంతో అంబటి వైసీపీతో పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని అందరు భావించారు. అందరు అనుకున్నట్టుగానే జగన్ సమక్షంలో పార్టీలో చేరారాయన. ఆ వెంటనే వైసీపీకి షాకిస్తూ.. ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. గతేడాది డిసెంబర్‌లో వైసీపీలో చేరిన అంబటి రాయుడు..జనవరి 6న ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే గుంటూరు ఎంపీ సీటుపై హామీ దక్కకపోవడంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చేశారనే వార్తలు వచ్చాయి.రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని వైసీపీని వీడిన సమయంలో అంబటి రాయుడు చెప్పారు. త్వరలోనే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. అయితే వైసీపీకి రాజీనామా చేసిన వెంటనేఅంబటి రాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిసి తన మద్దతు తెలిపారు.దీంతో ఆయన వచ్చే ఎన్నికల్లో జనసేన నుంచి బరిలోకి దిగనున్నారనే ప్రచారం జరిగింది. అయితే జనసేనలో కూడా అంబటికి నిరాశ ఎదురైంది. టికెట్ల కేటాయించే సమయంలో కనీసం అంబటి పేరును పరిశీలించినట్టుగా కూడా ఎక్కడ వార్తలు రాలేదు.దీంతో అంబటి తిరిగి వైసీపీలో చేరడానికి రెడీ అయ్యారనే తెలుస్తోంది.అంబటి రాయుడు బుధవారం వేకువజామున 3 గంటల సమయంలో ”సిద్ధం” అంటూ ఒక పోస్ట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో అంబటి రాయుడు పొలిటికల్ కెరీర్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ ట్వీట్‌తో అంబటి రాయుడు తిరిగి వైసీపీలో చేరతారనే ప్రచారం మొదలైంది. అంబటి రాయుడు మళ్ళీ వైసీపీలో చేరతారనే సంకేతాలు అందుతున్నాయి. ఆయన వైసీపీలో రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అయ్యారని..అందుకే ఈ ట్వీట్ చేశారని తెలుస్తోంది. దీనిపై ఒకటి , రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అంబటి వైసీపీలో చేరితే ఆయనకు ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.