Breaking News
Saturday, July 27, 2024
Breaking News

కామారెడ్డి జిల్లాలో అక్రమంగా వడ్డీ వ్యాపారాలు చేస్తున 70 మంది ఆఫీసులో పై పోలీసులు తనిఖీలు

- Advertisement -

కామారెడ్డి జిల్లాలో అక్రమంగా వడ్డీ వ్యాపారాలు నిర్వహిస్తున్న70 మంది అక్రమార్కుల ఇల్లు, ఆఫీసులో పోలీసుల తనిఖీలు…

– 23 మందిపై కేసులు నమోదు 

– భారీగా నగదు, బంగారం, ప్రాంసరీ నోట్లు, డాక్యుమెంట్లు, చెక్ బుక్ లు, వ్యవసాయ పాస్ బుక్కులు స్వాధీనం చేసుకున్న కామారెడ్డి జిల్లా పోలీసులు…

కామారెడ్డి బ్యూరో ఏప్రిల్ 12 వాయిస్ టుడే;

జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారి కేంద్రాలపై పోలీసుల దాడులు ముమ్మర తనిఖీలు విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. 

అక్రమ మార్గాల ద్వారా, అధిక వడ్డీల ద్వారా అమాయక ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు కామారెడ్డి ఎస్ పి సింధు శర్మ తెలిపారు.70 రైడ్స్, 23 కేసులు నమోదు, 49 లక్షల 58000, 157 గ్రాముల బంగారం,315 ప్రాసరి నోట్లు, 63 ల్యాండ్ డాక్యుమెంట్స్ 24 అగ్రికల్చర్ ల్యాండ్ డాక్యుమెంట్లు, 25 చెక్స, పట్టా పాస్ బుక్కులు మరియు కాళీ ప్రామిసరీ నోట్స్, నోట్స్ బుక్స్ ను మరియు ఇతర డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకోవడం జరిగిందిని,జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు, మోసపూరిత మాటల ద్వారా మరికొందరు వ్యాపారులు అమాయక ప్రజలను చూసి ఆర్థిక సహాయం చేస్తామని తెలుపుతూ వారి వద్ద నుండి ఇల్లు మరియు ప్లాటు వ్యవసాయ భూముల దస్తావేజులను తీసుకొని అప్పులు ఇస్తున్నారు. తిరిగి డబ్బులు చెల్లించాలని అధిక వడ్డీ రేట్ల లెక్కలు చూపుతూ చెల్లించలేని పరిస్థితులను తీసుకువస్తూ వారి ఆస్తుల దస్తావేజులను జప్తు చేసుకోవడం జరుగుచున్నది. ఇలా వ్యాపారం చేస్తున్నారు అని అనుమానం/ సమాచారం ఉన్న వ్యాపారులందరిపై జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో దాడులు చేయడం జరిగింది. తనిఖీలలో పట్టుబడ్డ ఆధారాలను పరిగణలోకి తీసుకొని ఇలాంటి అక్రమ వ్యాపారాలు చేస్తున్న వారిపై కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 70 రైడ్స్ చేయడం జరిగింది అందులో 23 కేసులు నమోదు చేయబడినవి. దీనిలో భాగంగా 49 లక్షల 58000, 157 గ్రాముల బంగారం,315 ప్రాసరి నోట్లు, 63 ల్యాండ్ డాక్యుమెంట్స్ 24 అగ్రికల్చర్ ల్యాండ్ డాక్యుమెంట్లు, 25 చెక్స, పట్టా పాస్ బుక్కులు మరియు కాళీ ప్రామిసరీ నోట్స్, నోట్స్ బుక్స్ ను మరియు ఇతర డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకోవడం జరిగింది వ్యాపారులు చేస్తున్న ఆర్థిక మోసాలను తట్టుకోలేక ఎంతోమంది బాధితులు కుటుంబ సమేతంగా ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఇలాంటి ఆత్మహత్యలను నివారించాలనే ఉద్దేశంతోనే అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మోసపూరిత వ్యాపారులపై దాడులు చేయడం జరిగింది, చట్ట వ్యతిరేక చర్యలు పాలు పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సిహెచ్ సింధు శర్మ అక్రమార్కలను హెచ్చరించారు.

– కామారెడ్డి జిల్లా సదాశివల మండలంలోని పటానికి చెందిన ప్రభాకర్ ఇంట్లో తనిఖీ చేయగా బంగారం నగదు విలువైన డాక్యుమెంట్స్ అక్రమ పద్ధతిలో ఉన్నాయని స్వాదులపరచుకున్నట్లు తెలిపారు

అప్పులు ఇస్తూ అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్న సదాశివ నగర్ కు చెందిన ప్రభాకర్ ఇంట్లో తనిఖీ చేసి సంబంధిత డాక్యుమెంట్స్ మరియు 49,58,140/- నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!