0.1 C
New York
Wednesday, February 21, 2024

కేటీఆర్ సభకు పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు..!

- Advertisement -

ఎసిపి. తుల శ్రీనివాస్…

పెద్దపల్లి జిల్లా: సెప్టెంబర్. 30 (వాయిస్ టుడే) గోదావరిఖని.  తెలంగాణ రాష్ట్ర ఐటీ  మున్సిపల్ శాఖ  మంత్రి కల్వకుంట్ల తారక రామారావు  రామగుండంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనుటకు మరియు బహిరంగ సభలో పాల్గొని, వస్తున్న సందర్భంగా…… చుట్టుపక్కల మండలాల నుండి మరియు గోదావరిఖని పట్టణం నుండి వేల సంఖ్యలో ప్రజలు, బి ఆర్ ఎస్ శ్రేణులు ప్రజలు పాల్గొంటారు  ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా మరియు వాహనాలను ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేసి వెళ్లడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వివిధ ప్రాంతాల నుండి వచ్చే వాహనాల పార్కింగ్ కోసం ఈ  స్థలాలను ఏర్పాటు చేశారు.  గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు ఎదురుగా ఉన్న సాక్రేడ్ హాట్ స్కూల్..  ఫైవ్ ఇంక్లైన్ ఏరియాలో ఉన్న రామాలయం… గోదావరిఖని సింగరేణి ఆసుపత్రి పక్కన ఉన్న సబ్ స్టేషన్.. ఎల్బీనగర్ వి టి సి కి ఎదురుగా ఉన్న సరస్వతి శిశు మందిర్ ల వద్ద పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయడం జరిగింది.కావున అందరూ గమనించి తమ తమ వాహనాలను ఆ ప్రదేశాలలో పార్క్ చేసుకొని పోలీస్ సహకరించాలని. గోదావరిఖని, ఏసిపి తుల శ్రీనివాస్ తెలిపారు

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!