Breaking News
Friday, July 26, 2024
Breaking News

5 గంటలపాటు ఊపిరాడక అస్వస్థతకు

- Advertisement -

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌ మారిషస్‌ కు చెందిన ఓ విమానంలో శనివారం సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో ప్రయాణికులు కొన్ని గంటల పాటు ఉండిపోయారు. ఈ క్రమంలోనే పలువురు చిన్నారులు ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు.
మహారాష్ట్ర రాజధాని ముంబయి నుంచి ఎంకే 749 విమానం ఈ తెల్లవారుజామున 4.30 గంటలకు మారిషస్‌ బయల్దేరాల్సి ఉంది. 3.45 గంటల నుంచి ప్రయాణికులందరిని ఎక్కించారు. అయితే టేకాఫ్‌ చేస్తుండగా ఇంజిన్‌లో సమస్య ఏర్పడింది. దీంతో విమానాన్ని రన్‌వేపైనే ఉంచారు. కానీ, ప్రయాణికులను మాత్రం కిందకు దిగేందుకు అనుమతించలేదు. దాదాపు 5 గంటలపాటు వారు అందులోనే ఉండాల్సి వచ్చింది.
ఆ సమయంలో ఏసీలు పనిచేయకపోవడంతో ప్రయాణికుల్లోని పలువురు చిన్నారులు, వృద్ధులు అస్వస్థతకు గురయ్యారు. వారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో వెంటనే వారిని కిందకు దించి చికిత్స అందించినట్లు తోటి ప్రయాణికులు మీడియాకు తెలిపారు. ప్రస్తుతం విమానాన్ని రద్దు చేసి ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు అధికారులు గానీ, ఎయిర్ మారిషస్‌ గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!