- Advertisement -
ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం సంచలనానికి తెరదీసింది. బ్రిటీష్ కాలం నాటి ఇండియన్ క్రిమినల్ చట్టాలైన ఐపీసీ .. (Indian Penal Code), సీసీపీ (Code of Criminal Procedure), ఐఈఏ (Indian Evidence Act) స్థానాల్లో కొత్త చట్టాలను ప్రవేశపెట్టేందుకు సిద్దమైంది. ఐపీసీ స్థానంలో ‘భారతీయ న్యాయ సంహిత’ (Bharatiya Nyaya Sanhita) కొత్త చట్టాన్ని తీసుకోరాబోతోంది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలకమైన మూడు బిల్లులను నేడు (శుక్రవారం) లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ స్థానంలో ‘భారతీయ నాగరిక్ సురక్షా సంహిత’, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ‘భారతీయ సాక్ష్య’ చట్టాలకు సంబంధించిన బిల్లులను సభలో ప్రవేశపెట్టారు..
- Advertisement -