27.7 C
New York
Thursday, June 13, 2024

కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ …రివ్యూ !

- Advertisement -

నటన లో మంచి ఈజ్ ఉండి, పాత్రల్ని సహజం గా పండించగలగిన  నటి – నిత్యా మీనన్.

గ్రామీణ వాతావరణం లోని మహిళల్లో, ఉండే వ్యాపార దక్షత నీ, కాన్ఫిడెన్స్ ని, పరిస్థితులకు ఎదురుళ్లి పోరాడే తాత్వాన్ని దీంట్లో దర్శకుడు – గోంటేష్ ఉపాధ్యాయ బాగా చూపించాడు.

దీంట్లో, నిత్యా మేనన్ పేరు – శ్రీమతి – పెళ్లి కానీ శ్రీమతి – -కాదు, కాదు *పెళ్ళి చేసుకోని )  కుమారి.

సో, తన పేరు – మిస్ శ్రీమతి – అంటే – కుమారి శ్రీమతి.

kumari-smriti-web-series-amazon-prime
kumari-smriti-web-series-amazon-prime

చిన్నప్పుడు, తన తాత గారి (మురళీ మోహన్ ) కీ, ఇచ్చిన మాట కోసం, తాత గారి ఇల్లు, దొంగ వీలునామా ద్వారా, ఆ ఇంటిని, కోర్టు ద్వారా దక్కించుకుని, అమ్మేయడానికి, అడ్వాన్స్ కూడా తీసుకుంటాడు, శ్రీమతి కి సొంత బాబాయ్ – కేశవ రావు ( ప్రేమ్ సాగర్ ).  శ్రీమతి నాయనమ్మ గా సీనియర్ నటి తాళ్లూరి రామేశ్వరి, తల్లి గా మరో సీనియర్ నటి గౌతమి వారి పాత్ర ల్లో చక్కగా నటించారు.

తన కి, తన తాత, నాయనమ్మ ల కి ఇష్ట మైన ఇంటి ని దక్కించుకోవడానికి, చేసే న్యాయ పోరాటం లో, జడ్జి గారు ( బాబు మోహన్ ) అన్సెస్ట్రాల్ ప్రాపర్టీ కాబట్టి, కొనుక్కోవడానికి, ఫస్ట్ ఆప్షన్ శ్రీమతి కే ఇచ్చి, 39 లక్షలు కట్టమని,  ఆరు నెలల టైం ఇస్తాడు.  ఇంతవరకు, ఫస్ట్ ఎపిసోడ్ లోనే దర్శకుడు, తెల్చేశాడు.  ఇక్కడి నుంచి, కధ లో టెంపో బిల్డ్అవుతుంది.

శ్రీమతి, ఆ డబ్బు సంపాదిస్తానికి, అదే పల్లెటూళ్ళో బార్ & రెస్టారెంట్ ఓపెన్ చేయడానికి, ప్లాన్ చేస్తుంది. ఆ ప్రాసెస్ లో, తన పక్కింటి స్నేహితుడు ( నిరుపం పరిటాల- డాక్టర్ బాబు – కార్తీక దీపం ఫేమ్ ),  తన చిన్నప్పటి క్లాస్ మేట్ – అభి ( తిరువీర్ ), ఇంకా వేరే ఫ్రెండ్స్ తనకి ఎలా హెల్ప్ చేశారు, ఈ జర్నీ లో, బార్ పెట్టినప్పుడు, ఊళ్ళో ఆడవాళ్ళ నుంచీ, వచ్చే సమస్యల నుంచీ, బయట పడిన విధానం, ఇవ్వన్నీ కూడా చక్కని సిట్యుయేషనల్ హాస్యాన్ని పండిస్తాయి.

తన టైమిగ్ లోనే కామెడీ మార్కు ఉన్న అవసరాల శ్రీనివాస్, ఈ సీరిస్ కి, స్టోరీ, స్క్రిప్ట్, డైలాగ్స్ అనేవి మంచి అసెట్. తెలుగు సినిమా మర్చిపోయిన మరో మంచి నటుడు – సుబ్బరాయ శర్మకి మంచి క్యారెక్టర్ పడింది. తన మనవణ్ణి – తిరువీర్ ని జీతం అడుగుతూ, “ఎక్కువడబ్బు వెనకురోయ్, వెనకే ఉండిపోతుంది” అనే డైలాగు డబ్బు తాలూకు నిజమైన విలువ ని చెబుతుంది.  శ్రీమతి ని ఇష్ట పడే హీరో క్యారెక్టర్స్ ముగ్గురూ – నిరూపం, తిరువీర్, శ్రీనివాస్ అవసరాల- ముగ్గురూ చాలా బాలన్స్డ్ గా, హుందా గా యాక్ట్ చేశారు.

kumari-smriti-web-series-amazon-prime
kumari-smriti-web-series-amazon-prime

నేను, నా కుటుంబం అని, అని పిల్లల్ని పెంచే ఈ రోజుల్లో, ఉమ్మడి కుటుంబం, మూడు తరాల మహిళల కలిసి ఎమోషన్స్ ని పంచుకుంటూ చేసే ప్రయాణం, తూర్పు గోదావరి జిల్లా అందాలు, మనసుకు హత్తుకునేట్లు చక్కగా, అందం గా చూపించాడు – డి. ఓ. పి. మోహన కృష్ణ – తన కెమెరా పనితనం తో. సందర్బచితం గా బాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు – మ్యూజిక్ డైరెక్టర్స్ – స్టె క్క టో & కామ్రాన్. మంచి ఫీల్ గుడ్ పాటలు ఉన్నాయి – ముఖ్యం గా, హీరోయిన్,  తిరువీర్ ల మధ్య వచ్చే బాక్గ్రౌండ్ సాంగ్ మెలోడీయోస్ గా ఉంది.

కుటుంబ కధ చిత్రాలకి పేరున్న స్వప్న మూవీస్ తన వెబ్ సిరీస్ బ్యానర్ “ఎర్లీ మాన్సూన్ టేల్స్” పతాకం లో నిర్మించిన కుమారి శ్రీమతి వెబ్ సిరీస్, పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ – కుటుంబం అంతా కలసి సీనియర్  నటులు పాత్రోచితం గా పండించే చక్కని, చిక్కని హాస్యాన్ని ఎంజాయ్ చేయాలంటే, ఆలస్యం ఎందుకు???  ఆమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది – నేడే చూసేయండి – సత్య కేశరాజు

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!