Breaking News
Saturday, July 27, 2024
Breaking News

టిజిపిఎస్‌సి వెబ్‌సైట్‌లో గ్రూప్-4 మెరిట్ జాబితా విడుదల

- Advertisement -

టిజిపిఎస్‌సి వెబ్‌సైట్‌లో గ్రూప్-4 మెరిట్ జాబితా విడుదల
హైదరాబాద్ జూన్ 10
రాష్ట్రంలో గ్రూప్ 4 ఉద్యోగాలకు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టిజిపిఎస్‌సి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ధృవపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులు అవసరమైన సర్టిఫికెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని కమిషన్ తెలిపింది. టిజిపిఎస్‌సి కార్యాలయం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు పేర్కొంది.అభ్యర్థులు ఈ నెల 13 నుంచి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని తెలిపింది. త్వరలోనే రోజువారీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్‌ను ప్రకటిస్తామని పేర్కొంది. రాష్ట్రంలో 8,180 గ్రూప్- 4 ఉద్యోగాల భర్తీకి గతేడాది జులై ఒకటో తేదీన రాతపరీక్ష నిర్వహించి, ఈ ఏడాది ఫిబ్రవరి 9న మెరిట్ జాబితాను టిజిపిఎస్‌సి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో త్వరలోనే గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ధృవపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు టిఎస్‌పిఎస్‌సి వెల్లడించింది.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!