మహిళా ఐక్య వేదిక కార్యవర్గ సమావేశం
కర్నూలు
స్థానిక బి క్యాంపులో గల యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక ప్రధాన కార్యాలయంలో కార్యవర్గ సమావేశం మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి ఆద్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్నం రాజేశ్వరి మాట్లాడుతూ కమిటీ సభ్యులు అందరూ కలిసికట్టుగా శ్రమించి మహిళా ఐక్య వేదికను మరింత బలోపేతం చేయాలని ఆమె ఉమ్మడి జిల్లాల కార్యవర్గ సభ్యులను కోరారు. కర్నూలు జిల్లా మరియు నంద్యాల జిల్లాలోని అన్ని మండలాల్లో మహిళా ఐక్య వేదిక కమిటీ నిర్మాణాలు చేపట్టాలని, ఆమె కమిటీ సభ్యులకు తెలిపారు. మహిళ తన ఆత్మగౌరవం, హక్కులకై నిరంతరం పోరాడాల్సిన పరిస్థితి ప్రస్తుత సమాజంలో ఉందని ఆమె అన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు, హత్యలకు, దాడులకు, వ్యతిరేకంగా మహిళలంతా ఏకమై పోరాటాలకు సిద్ధం కావాలని ఆమె మహిళా ఐక్య వేదిక కార్యవర్గానికి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ముడియం సునీత, హుస్సేన్ బీ, కటికె భాను, పెద్దక్క, ఆకుతోట పద్మావతి,దస్తగిరమ్మ, ఖాసింబీ, లక్ష్మేశ్వరి, షేకున్ బీ, అమీనాబీ, ప్రభావతి , మరియమ్మ, తదితరులు పాల్గొన్నారు.