Breaking News
Friday, July 26, 2024
Breaking News

ఆదరిద్దాం..అండగా నిలుద్దాం    

- Advertisement -

ఆదరిద్దాం..అండగా నిలుద్దాం                    .

జిల్లా సంక్షేమ అధికారి ఆడెపు భాస్కర్

జగిత్యాల
వయోవృద్ధులైన తల్లిదండ్రులను ఆదరించాలని అండగా నిలవాలని , సంరక్షణ భద్రత కల్పించాల్సిన బాధ్యత పిల్లలదేనని,వారిని విస్మరించేవారు శిక్షార్హులేనని   జిల్లా సంక్షేమ అధికారి ఆడెపు భాస్కర్ అన్నారు. .శుక్రవారం జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, జగిత్యాల జిల్లా  అధ్యక్షుడు   హరి ఆశోక్ కుమార్   ఆధ్వర్యంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్  అసోసియేషన్  ముద్రించిన  సీనియర్ సిటీజేన్స్ పిలుపు పుస్తకాన్ని,2024 డైరీ,క్యాలెండర్ల ను అసోసియేషన్ ప్రతినిధులు  జిల్లా సంక్షేమ అధికారికి ,వారి సిబ్బందికి అందజేశారు…ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి తల్లిదండ్రులు,
వయోవృద్ధులక పోషణ,సంక్షేమ చట్టం పై జిల్లా,డివిజన్,
మండల,గ్రామ కేంద్రాల్లో అవగాహన కల్పిస్తున్న తెలంగాణ అల్ సీనియర్  సిటీజేన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రతినిధులు చేస్తున్న కృషిని అభినందించారు వయో  వృద్ధుల కోసం ప్రత్యేక  టోల్ ఫ్రీ నెంబర్ 14567  ఉందని  ,వారిని నిరాదరిస్తున్న,వేధిస్తున్న వారిపై ఫిర్యాదులు చేయవచ్చన్నారు.వేధింపులకు గురి చేసిన వారికి వయో వృద్ధుల సంరక్షణ చట్టం 2007 ప్రకారం 3 నెలల వరకు జైలు శిక్ష ,జరిమానా విధించే వీలుందన్నారు. గతంలో టీ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసుల అసోసియేషన్ జగిత్యాల  జిల్లా అధ్యక్షుడుగా ,టీ ఉద్యోగుల జేఏసి నేతగా సేవలు అందించిన సీనియర్ సిటీజన్స్  రాష్ట్ర కార్యదర్శి జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో అస్సోసియేషన్ ప్రతినిధులు జిల్లాలో వయోవృద్దుల సంరక్షణ చట్టం మేరకు తల్లిదండ్రులను  నిరాదరిస్తున్న  కొడుకులు,కూతుర్లు,కోడళ్లకు కౌన్సెలింగ్ లు చేస్తూ పరిష్కారం కోసం కృషి చేయడం ఆదర్శనీయమన్నారు.. .అనంతరం హరి ఆశోక్ కుమార్  మాట్లాడుతూ ఆదర్శ  జిల్లా సంక్షేమ అధికారిగా  కొద్ది కాలానికే  ఆడెపు భాస్కర్ మంచి  పేరు తెచ్చికున్నారని కొనియాడారు , గతంలో జిల్లాలో పరిష్కారం అయిన  పలు కేసులను వివరించారు. తమ రాష్ట్ర  అసోసియేషన్ ప్రభుత్వం గుర్తింపు పొందిందని,ఇటీవల వయోవృద్ధుల సంరక్షణ చట్టం 2007 నియమావళి 2011 లో సవరణలకు  తమ రాష్ట్ర అధ్యక్షుడు పి.నర్సింహ రావు      అభ్యర్థన మేరకు రాష్ట్ర  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   వృద్ధులకు మరింత భరోసా కల్పించే0దుకు  ఆదేశాలు జారీ చేస్తామని, సమస్యల్ని పరిష్కారిస్తామన్నారని,హైదరాబాద్ లో తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్  అసోసియేషన్ కు భవన నిర్మాణంకు ప్రభుత్వ స్థలం కేటాయించి,ప్రభుత్వం తరపున నిధులు మంజూరు చేస్తామని  హామీ ఇవ్వడం పట్ల  ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపామన్నారు. కార్యక్రమంలో   కార్యాలయం ప్రధాన సహాయకులు చంద్రమోహన్,ఫీల్డ్ అధికారులు కొండయ్య,తిరుపతి, సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర కార్యదర్శి,
జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ,గౌరవ సలహా దారు జీ.ఆర్.దేశాయ్, ,ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం,ఉపాధ్యక్షులు పి.సి.హన్మంత్ రెడ్డి, బొల్లం విజయ్,ఎండి.యాకూబ్,
సంయుక్త కార్యదర్శి దిండిగాల విట్ఠల్, జగిత్యాల పట్టణ అధ్యక్షుడు సతీష్ రాజ్,
కార్యదర్శి మానాల కిషన్,
కోశాధికారి సింగం భాస్కర్,
ఉపాధ్యక్షులు ఎం.డి.ఎక్బాల్
,సయ్యద్ యూసుఫ్,  నాయకులు వేముల దేవరాజం,ధర్మపురి అధ్యక్షుడు కండ్లే గంగాడర్,జిల్లా,డివిజన్,
మండలాల ,గ్రామాల సీనియర్ సిటీజేన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!