

సమావేశంలో మాట్లాడుతున్న కరాటం రాంబాబు
రాష్ట్ర కాపు జె ఏ సి అద్యక్షులు చందు జనార్ధన్ పిలుపు
జంగారెడ్డిగూడెం;-
రాజకీయలకు అతీతంగా కాపు జెఏసీ కాపులకు రక్షణ కవచంగా పనిచేస్తుందని కాపు జెఏసీ
నాయకులు స్పష్టం చేసారు.రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జె ఏ సి
ముందుకు వెళుతున్నదని
పేర్కొన్నారు.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం లోనిసౌభాగ్య కాంప్లెక్స్ లో
మంగళవారం కాపు జె ఏ సి
సమావేశం మాజీ డి సి సి బి చైర్మన్, సినీ నిర్మాత కరాటం రాంబాబు అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా ఏజెన్సీ మెట్ట ప్రాంత కాపు సంఘ ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన
ప్రజా ప్రతినిధులు కరాటం పిలుపు మేరకు పాల్గొన్నారు. సమావేశం లో కాపు జె ఏ సి అద్యక్షులు చందు జనార్ధన్ మాట్లాడుతూ 25 శాతం ఉన్న కాపు వర్గాలు రాజ్యాధికారం వైపు వెళ్ళాలని పిలుపు నిచ్చారు. రాజ కీయ పార్టీలు వార్డు మెంబర్ నుండి పార్లమెంట్ మెంబర్ వరకు పదవుల్లో కాపు వర్గాలకు జనాభా దామాషా ప్రకారం సీట్లు కియించా లని ఆయన డిమాండ్ చేశారు.వ్యవసాయ శాఖకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించిన విధంగా కాపు బడ్జెట్ కేటాయించి కాపు కార్పొరేషన్ ద్వారా నిధులు ఖర్చు చేయాలని చందు జనా ర్థన్ కోరారు. తమిళనాడు తరహా బీసీ రిజర్వేషన్ పెంచి కాపు,తెలగ,బలిజ,ఒంటరి లకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని పేర్కొన్నారు. రాష్ట్ర కాపు జేఏసీ ప్రకటించిన డిమాండ్ లను రాజకీయ పార్టీలు ఎన్నికల మేని ఫెస్ట్టో లో పొందు పరిచి వైఖరి ప్రకటించాలని కోరారు.కాపు ఉద్యోగులు ,ప్రముఖులపై జరిగే దాడులను నిరోధించాలని వారికి జేఏసీ పూర్తి స్థాయి మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. కరాటం రాంబాబు మాట్లాడుతూ
ప్రతి కాపు యువకుడు ఉన్నత విద్యావంతుడు
గా ఎదగాలని ఆకాంక్షించారు. స్వయం శక్తి తో వృద్ధి చెందాలని పిలుపునిచ్చారు
కులం కంటే స్నేహం మిన్న
అని పొరుగు వారిని ప్రేమించడం సమాజ ప్రగతికి దోహదపడుతుందని చూచించారు.
ఈ కార్య క్రమం లో జేఏసీ రాష్ట్ర నాయకులు ముత్యాల రామదాసు, నల్లా విష్ణు, వాసిరెడ్డి ఏసుదాసు, మంచాల సాయి సుధాకర్ నాయుడు స్థానిక జెడ్పి టిసి మెంబర్ పొల్నాటి బాబ్జి,తెదేపా టౌన్ ప్రెసిడెంట్ రావూరి కృష్ణ,
కాపు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పులి శ్రీరాములు, విజ్జు వెంకట స్వామి నాయుడు,వైసీపీ మండల అధ్యక్షుడు వామిశెట్టి హరిబాబు తదితరులు
పాల్గొన్నారు.బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అచ్యుత శ్రీనివాసరావు కార్యక్రమం నిర్వహించారు.