దొంగ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలి
-బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి కి మద్దతుగా తూప్రాన్ లో రోడ్ షో ప్రచారం
-5 నెలల కాంగ్రెస్ పాలన రివర్స్ గేర్ పాలన లాగా ఉంది….
-మాజీ మంత్రి హరీష్ రావు
మెదక్/తూప్రాన్; మే5 (వాయిస్ టుడే ప్రతినిధి)
కాంగ్రెస్ పాలనలో కరెంట్ సమస్య మళ్ళీ ప్రారంభం అయింది.
కాంగ్రెస్ వి దొంగ మాటలు గద్దెనెక్కినక ప్రజలను తన్నేసారు అని పేర్కొంటూ.. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కార్నర్ రోడ్ షో సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ అబద్ధాల పార్టీ కాంగ్రెస్ పార్టీ కరోన కష్టాల్లో కూడా రైతు బంధు వేసిన ఘనత కేసీఆర్ దే అన్నారు.మహిళలను ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీ కి లేదు కాంగ్రెస్ పార్టీ వి బోగస్.. కార్పొరేట్ల కోసమే బీజేపీ గ్యాస్ ,పెట్రోల్ పెంచిన బీజేపీ కి ఓటు వేస్తే చెత్తలో వేసినట్లేదేవుడి పేరుతో రాజకీయం చేసి ఓట్లు అడిగే బీజేపీ వాళ్ళని నమ్మొద్దు అన్నారు.
రిజర్వేషన్లు రద్దు చేస్తానని చెప్పిన బిజెపికి ఓట్లు వేస్తే బూడిదిలో కాలు వేసినట్టే అన్నారు.మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 3 వ స్థానంలో ఉంది బి ఆర్ ఎస్ పార్ బీజేపీ తో కలిసే ప్రసక్తే లేదు గజ్వేల్ కు పూర్వ వైభవం రావాలి అంటే బి ఆర్ ఎస్ కి ఓట్ వేయాలి అన్నారు. కాంగ్రెస్ అంటేనే అబద్దాల పార్టీ అని మాజీ మంత్రి బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు.బిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి తరపున తూప్రాన్ లో రోడ్ షో లో పాల్గొని కార్నర్ మీటింగ్ లో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు నోరు తెరిస్తే సిగ్గులేకుండా దొంగమాటలు చెప్పి పబ్బం గడుపుతున్నారని అన్నారు.రాహుల్ గాంధీ నిర్మల్ సభలో మాట్లాడుతూ మహిళలకు 2500 ఇస్తున్నాం అని అంటున్నారు.
ఎక్కడిస్తున్నారు,నిద్రలో మాట్లాడుతున్నారా ఎద్దెవా చేశారు.కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన రోజు నుండి కరెంట్ కోతలు,నీళ్లు రావు,పథకాలు రావు మాటలు చెప్పి పూట గడుపుకోవడం కాంగ్రెస్ నైజం అని మండిపడ్డారు.అందుకే దొంగ మాటలు చెప్పే కాంగ్రెస్ కు ఓటు వేయొద్దని కెసిఆర్ వదిలిన బాణం మన వెంకట్రాంరెడ్డి రెడ్డి చదువుకున్న విద్యావంతులను అని అయన ఎప్పుడు ప్రజల కోసమే పనిచేసే గుణం ఉన్న అధికారి మీకు తెలుసు అలాంటి వ్యక్తి ని గెలిపించి పార్లమెంట్ కు పంపితే ఉపయోగం ఉంటది కాని ఏమి చేయలేని కాంగ్రెస్, బీజేపీ లకు ఓటు వేస్తే వృధా అవుతుంది అని అన్నారు.కెసిఆర్ అందించిన పథకాలు ఇప్పటికి ప్రజల మనసులో ఉన్నాయని అన్నారు.కొడుకుగా,
తోబుట్టువుగా అందరికి అండగా నిలిచినా వ్యక్తి మన కెసిఆర్ అయన చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి బిఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి ని భారీ మెజారిటీ తో గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమం లో ఎమ్మెల్సీ యాదవరెడ్డి,మాజీ ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి,జడ్పీటీసీ రాణి సత్యనారాయణ గౌడ్,తూప్రాన్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బాబుల్ రెడ్డి రవీందర్ గౌడ్,సతీష్ చారి, పురం రవి , శ్రీనివాస్ మరియు కౌన్సిలర్ లు బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.