0.1 C
New York
Wednesday, February 21, 2024

24 గంటల్లోనే శంషాబాద్‌ హత్య కేసు ఛేదించిన పోలీసులు

- Advertisement -
Police solved Shamshabad murder case within 24 hours
Police solved Shamshabad murder case within 24 hours

హైదరాబాద్:ఆగస్టు 12:  తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన శంషాబాద్ మహిళ మంజుల హత్య కేసులో అసలు నిజాలను పోలీసులు బయటపెట్టారు.

మంజుల మృతికి డబ్బే కారణమని పోలీసులు నిర్ధారించారు. మంజుల హత్యకు కుట్ర పన్నిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం తెలిసి అంతా ఆశ్చర్యపోయారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు రిజ్వానాగా పోలీసులు గుర్తించారు.

మంజుల ఇంటి సమీపంలో రిజ్వానా లేడీస్ ఎంపోరియం నడుపుతోంది. ఈ క్రమంలో రిజ్వానాకు మంజుల లక్ష రూపాయల వరకు అప్పుగా ఇచ్చింది. ఇచ్చిన అప్పు తిరిగి చెల్లించకపోవడంతో పలుమార్లు రిజ్వానాను మంజుల ఆమె భర్త నిలదీశాడు. గత రెండు నెలలుగా రిజ్వానా వడ్డీకూడా చెల్లించలేదు. దీంతో రిజ్వానా ఇంటికి వెళ్లి మంజుల, భర్త లక్ష్మయ్యా గొడవపడ్డారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడికి గురిచేశారు.

దీంతో పగ పెంచుకు రిజ్వానా.. మంజులను హతమార్చాలని భావించింది. అనుకున్నదే తడవుగా పక్కా ప్రణాళికను రచించి మంజులను హతమార్చింది. ఆపై పెట్రోల్ పోసి తగలబెట్టింది. ఈ ఘటన జరిగిన 24 గంటల్లో పోలీసులు మిస్టరీని చేధించారు.

మంజుల హత్యపై వివరాలు వెల్లడించిన శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి..

మంజులను రిజ్వానా అనే మహిళ హత్య చేసిందని.. రిజ్వనాకు ఎవరూ సహకరించలేదని శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు.

ఈ నెల 10 అర్ధరాత్రి మహిళా మృతదేహాన్ని గుర్తించాము. డెడ్ బాడీ పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉంది.. కాళ్ళకు మెట్టెలు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించి కేసును చేధించే ప్రయత్నం చేశాం. అదే సమయంలో 11న శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఓ మిస్సింగ్ కేసు నమోదు అయింది.

శంషాబాద్‌లో మరో హత్య

డెడ్ బాడీ దొరికిన స్థలంలో తాళాలు, మెడికల్ స్లిప్ కూడా దొరికింది. ఆ తాళాలు తీసుకుని వెళ్లి మృతురాలు ఇంట్లో కబోర్డ్ ఓపెన్ చేసాం. దీంతో మిస్సయింది, చనిపోయింది మంజులాగా గుర్తించాం.

పదవ తేదీ ఉదయం మంజుల ఇంట్లో నుండి బయటకు వచ్చింది. ఆర్థిక లావాదేవీలు హత్యకు కారణంగా గుర్తించాము. రిజ్వానా బేగం అనే మహిళ నిందితురాలిగా గుర్తించాం. రిజ్వానా బేగం గతంలో ఎయిర్పోర్టులో పనిచేసింది ప్రస్తుతం ఫ్యాన్సీ స్టోర్ రన్ చేస్తుంది. రిజ్వానా బేగంకు మంజుల ఒక లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చినట్టు గుర్తించాం.

లక్ష రూపాయలు వివాదంతోనే మంజులను రిజ్వానా హత్య చేసింది. తీసుకున్న అప్పుకు బాండ్ రాసి ఇస్తాను ఇంటికి పిలిపించింది రిజ్వానా. అక్కడే ఇద్దరూ కలిసి భోజనం చేసే క్రమంలో భోజనం విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం మంజుల కళ్ళలో కారంతో దాడి చేసింది రిజ్వానా. ఆపై చీర కొంగుతో మంజుల మెడ గట్టిగా ఊపిరి ఆడకుండా చేసి చంపింది.

అనంతరం మృతదేహాన్ని ఇంట్లో బెడ్ కింద దాచిపెటింది. అనంతరం రాత్రి 11 గంటలు దాటిన తర్వాత మృతదేహాన్ని ఇంట్లో నుంచి బయటకు తీసుకువచ్చింది. కొద్దిదూరం లాక్కొని వచ్చి పెట్రోల్ సిద్ధం చేసుకుని మృతదేహాన్ని బండిపై తీసుకువచ్చింది. సాయి ఎంక్లవ్ ఖాళీ స్థలంలో పెట్రోల్ పోసి తగలబెట్టింది.

పెట్రోల్ పోసి తగలబెట్టిన అనంతరం అక్కడ నుంచి వెళ్లిపోయింది. వెళ్తూ వెళ్తూ మృతురాలి మెడలో పుస్తెలతాడు తీసుకొని వెళ్ళింది.. రిజ్వానాకు ఎవరు సహకరించలేదు.. బాడీని తగలబెట్టిన అనంతరం కొత్తూరు వెళ్లిపోయింది. 24 గంటల్లోనే కేసును చేధించాము. మృతురాలి దగ్గర తీసుకున్న పుస్తెలతాడును రూ.83 వేలకు ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టింది. మంజులకు రిజ్వానాకు మధ్య చాలా కాలం నుండి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. రిజ్వానాను కస్టడీలోకి తీసుకున్నాం..

నేడు రీమాండ్‌కు తరలిస్తాం. రిజ్వానా బేగం తన భర్త కలిసి అజ్మీర్ వెళ్లడానికి టికెట్స్ బుక్ చేసుకున్నారు’’ అంటూ హత్యకు సంబంధించిన వివరాలను శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి వెల్లడించారు..

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!