10 C
New York
Thursday, April 18, 2024

డబ్బులపై నిఘా…

- Advertisement -

డబ్బులపై నిఘా…
హైదరాబాద్, మార్చి 23

లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. డబ్బు ప్రభావంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో పలు జిల్లాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. వచ్చే పోయే వాహనాల్లో ఎలాంటి అనుమానంగా కనిపించినా ఆపి మరి జల్లెడ పడుతున్నారు.లెక్కలేని నగదు, పత్రాలు కనిపిస్తే వెంటనే స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామ శివారులో చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. కారులో ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న 2 లక్షల 50 వేల ఒక వంద రూపాయలను పోలీసులు సీజ్ చేస్తున్నారు.నల్గొండ జిల్లాలోని డిండి చెక్ పోస్టు వద్ద కూడా వాహన తనిఖీలు చేసిన పోలీసులు సరైన పత్రాలు లేని రూ.2.44 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేటలో కూడా తిరుమలగిరి చెక్ పోస్టు వద్ద వాహన తనిఖీలు చేయగా.. సరైన పత్రాలు లేని రూ. 2.51 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నల్గొండలోని నార్కట్‌పల్లిలో వాహన తనిఖీల్లో సరైన పత్రాలు లేని రూ.10 లక్షలు స్వాధీనం చేసుకున్నారుమిర్యాలగూడ రైల్వే స్టేషన్లో ఐదు కేజీల వెండి పట్టుకున్నారు. సరైన పత్రాలు లేని ప్రయాణికుడి నుంచి 5 కేజీల వెండిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొమురం భీం జిల్లాలో జైనూర్ మండలం జనగాం సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన పోలీసులు ముగ్గురు వేరువేరు వ్యక్తుల నుంచి రూ.2,45,000 నగదు సీజ్ చేశారు.వాహనాల తనిఖీల్లో హవాలా డబ్బు గుట్టు రట్టు చేశారు పోలీసులు. రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్‌లో భారీగా హవాలా డబ్బును స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్ ఎస్ఓటీ టీమ్ రూ. 17.40 లక్షలు సీజ్ చేశారు. మోటర్ సైకిల్‌పై తరలిస్తున్న నగదును పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసిన అనంతరం కేసు నమోదు చేసి మైలార్ దేవ్ పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బేగంబజార్ టాస్క్ పోర్స్ అండ్ బేగంబజార్ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహనాలు తనిఖీల్లో ఒక వాహనంలో 30 లక్షలు పట్టుబడ్డాయి. ఆ డబ్బుకు ఎలాంటి పత్రాలు లేని కారణంగా బేగంబజార్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!