Breaking News
Saturday, July 27, 2024
Breaking News

దేశానికే అన్నం పెట్టేంతగా ధాన్యం

- Advertisement -
Grain enough to feed the country
Grain enough to feed the country

తెలంగాణ వ్యవసాయ రంగంలో దేశంలోనే అగ్ర‌గామి :మంత్రి  కెటిఆర్

హైదరాబాద్‌:ఆగస్టు 11: వ్యవసాయరంగంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉన్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశానికే అన్నం పెట్టేంతగా ధాన్యం పండిస్తున్నామని చెప్పారు.

హైదరాబాద్‌ శంషాబాద్‌లోని నోవాటెల్‌లో దేశంలోనే తొలి అగ్రికల్చర్‌ డేటా ఎక్సేంజ్‌ను శుక్రవారం మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌కు ఒక రైతు కాబట్టి వ్యవసాయంపై అవగాహన ఉందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని అతి తక్కువ సమయంలో నిర్మించామని చెప్పారు.

రైతులకు బీమా కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తమదన్నారు. వ్యవసాయ రంగానికి తెలంగాణ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇస్తున్నదని వెల్లడించారు.

Grain enough to feed the country
Grain enough to feed the country

గతంలో పాలమూరు నుంచి వలసలు ఉండేవని, ఇప్పుడు వలసలు లేవని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు.

రైతులకు ఉచితంగా 24 గంటలు విద్యుత్‌ సరఫరా చేస్తున్నామన్నారు. దేశంలో నాణ్యమైన పత్తి తెలంగాణ నుంచి వస్తున్నదని చెప్పారు. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులు పునరుద్ధరించామనన్నారు. రైతు ఆదాయం కూడా గ‌ణ‌నీయంగా పెరిగింద‌న్నారు..

ఉమ్మ‌డిపాల‌న‌లో క‌నీసం ఏడాదికి ఒక పంట వేసుకోలేని దుస్థితి నుంచి కెసిఆర్ పాల‌న‌లో మూడు పంట‌లు వేసే స్థాయికి ఎదిగామ‌ని చెప్పారు కెటిఆర్..

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!