- Advertisement -
జగ్గయ్యపేట
పెనుగంచిప్రోలు గ్రామంలో వేంచేసియున్న శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం మన తెలుగు రెండు రాష్ర్టాలలో ఎంతో ప్రసిద్ధి. కోరుకున్నవారికి కొంగు బంగారమై భక్తుల కోరికలు తీర్చడంతో ఎక్కడెక్కడి నుంచో భక్తులు ప్రతిరోజు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తుంటారు.
అయితే ఈ అమ్మవారి మహోత్సవాలలో బాగంగా రెండేళ్లకోసారి ఈ దేవస్థానంలో అందరి దేవతలకు రంగుల కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు.అయితే ఈ సంవత్సరం కూడా పెనుగంచిప్రోలు నుండి బయలుదేరి జగ్గయ్యపేటలో రంగుల ఉత్సవానికి అమ్మవారు సిద్దం అయింది. గురువారం కార్యక్రమాన్ని దేవస్థాన ఈఓ రమేష్ నాయుడు,ధర్మకర్తల చైర్మన్ జంగాల శ్రీనివాసరావు సమక్షంలో నిర్వహిస్తున్నారు.
- Advertisement -