పని చేసే వాహానాన్ని మూలన పెట్టారు
20 లక్షల రూపాయల ప్రజాధనం వృధా
బద్వేలు
బద్వేలు మున్సిపాలిటీలో ప్రజాధనం వృధా అవుతుంది అందుకు మచ్చుతునక వీధులను శుభ్రం చేసే యంత్రమే ప్రత్యక్ష నిదర్శనం . తెలుగుదేశం పార్టీ హయాంలో మున్సిపల్ చైర్మన్ గా సోమేశుల పార్థసారథి ఉన్నప్పుడు దాదాపు 20 లక్షల రూపాయలు ఖర్చు చేసి యంత్రాన్ని కొనుగోలు చేశారు. యంత్రాన్ని ఎంతో ఆర్బాటంగా ప్రారంభించారు. ప్రధాన విధుల్లో ఈ యంత్రంతో కొద్దిరోజులపాటు శుభ్రం చేశారు. కొద్దిరోజుల పాటు ట్రైలర్ను కూడా చేశారు. మున్సిపాలిటీకి మంచి రోజులు వచ్చాయని ప్రజలు భావించారు. యంత్రం బాగా పనిచేస్తుందని అధికారులు కూడా కితాబు ఇచ్చారు. ఆ తరువాత ఏమైందో గాని యంత్రాన్ని పక్కన పెట్టేశారు. ఈ యంత్రం నడిపేందుకు నియమించిన సిబ్బందిని కూడా వేరే పనులకు ఉపయోగించుకుంటున్నారు. ఎంతో ఉపయోగపడే యంత్రాన్ని ఎందుకు మూలన పెట్టారు అధికారులకే తెలియవలసి ఉంది. యంత్రం మూలన పెట్టడంతో దాదాపు 20 లక్షల రూపాయలు ప్రజాధనం వృధా అయ్యింది. యంత్రం విషయంలో సంబంధిత అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాల్సి ఉంది.
పని చేసే వాహానాన్ని మూలన పెట్టారు

- Advertisement -
- Advertisement -