వదినమ్మే డైరక్ట్ టార్గెట్…
కడప, మే 9,
ఏపీలో ఈసారి ఎన్నికలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గత ఎన్నికల కంటే భిన్నంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ కుటుంబంలో చీలిక వచ్చి.. సోదరుడు ఒకవైపు.. చెల్లెలు మరోవైపు నిలుస్తూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. కడప వేదికగాకుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్న రాజకీయం పతాక స్థాయికి చేరుకుంది. సోదరుడుతో విభేదించిన షర్మిలకు కాంగ్రెస్ పగ్గాలు దక్కాయి. కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపడానికి షర్మిల గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కడప రాజకీయాలు దడ పుట్టిస్తున్నాయి.కడప నుంచే తేల్చుకోవాలని షర్మిల గట్టిగానే డిసైడ్ అయ్యారు. కడప పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు. అటు పులివెందులలో సైతం సోదరుడికి చికాకు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు ప్రచారమే అన్నది కనిపించని పులివెందులలో.. తన గెలుపు బాధ్యతను అర్ధాంగి భారతికి అప్పగించారు జగన్. కడపలో వైసిపి దూకుడుకు చెక్ చెప్పాలని షర్మిల భావిస్తున్నారు. పులివెందులలో సైతం అన్నకు గట్టిగానే బదులిస్తున్నారు. దీంతో భారతి పులివెందులలో క్షణం తీరిక లేకుండా గడపాల్సి వస్తుంది. ఒకవైపు భారతి, మరోవైపు షర్మిల పోటీపడిప్రచారం చేస్తున్నారు. ఒకరి వ్యాఖ్యలపై ఒకరు గట్టిగానే రిప్లై ఇస్తున్నారు.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వైయస్ భారతి ఏపీలో వైసీపీ నే సింగిల్ ప్లేయర్ అంటూ చెప్పుకొచ్చారు. దీనికి కౌంటర్ ఇచ్చారు షర్మిల. గొడ్డలితో వివేకానంద రెడ్డిని నరికేసినట్టు.. మిగతా వాళ్ళను కూడా నరికేయండి.. అప్పుడు మీరే సింగిల్ ప్లేయర్ అంటూ షర్మిల విరుచుకుపడ్డారు. అదే సమయంలో కడప వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిపై సైతం తీవ్ర వ్యాఖ్యలు చేశారు షర్మిల. ఓటమితో అవినాష్ రెడ్డి ఊరు దాటేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. దీనికోసం పాస్పోర్ట్ కూడా సిద్ధం చేసుకున్నారని చెప్పుకొచ్చారు. మొత్తానికైతే ఒక వ్యూహం ప్రకారం వైయస్ భారతి తో పాటు అవినాష్ రెడ్డి పై విమర్శలతో దూసుకెళ్తున్నారు షర్మిల