మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన పవన్ కళ్యాణ్
విశాఖపట్నం: విశాఖలో జనసేన అధినే త పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగుతోంది.సుజాత నగర్ లో మాజీ వాలంటీర్ వెంకటేష్ చేతుల్లో హత్యకు గురైన వృద్ధురాలు కోటగిరి వరలక్ష్మి కుటుంబ సభ్యులను పవన్ పరామర్శించారు. వరలక్ష్మి కుటుం బానికి జనసేన పార్టీ అండగా ఉంటుం దని ఆయన చెప్పారు. వాలంటీర్లను తీసుకునేటప్పడు పోలీస్ వెరిఫికేషన్ చేయాలని డిమాండ్ చేశారు.వైసీపీ నాయకులు ఒక్కరు కూడా ఈ కుటుం బాన్ని పరామర్శించేందుకు రాలేదని.. తద్వా రా వారి ఆలోచన ఏమిటో అర్థం అవుతుందని అన్నారు.ఇన్ని వ్యవస్థ లు ఉన్నప్పటికీ.. వైసీపీ కార్యకర్తల కోసం సమాంతరంగా ఈ వ్యవస్థను తీసుకొచ్చారని అన్నారు. వారు ప్రాణా లు తీస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. చిన్నపాటి ఉద్యోగం కావాలన్న, పాస్పోర్టు కావాలన్న పోలీసు వెరిఫికేషన్ చేస్తారని.. వాలం టీర్ల నియామకంలో మాత్రం ఎలాంటి పోలీసు వెరిఫికేషన్ తీసుకోవడం లేదని అన్నారు. ఇదేమి విధానం అని ప్రశ్నించారు. ఇది రాజ్యాంగ విరుద్దం అని విమర్శించారు. నవరత్నాల కోసం పెట్టుకున్న వ్యవస్థ ప్రజల ప్రాణాలు తీస్తే ఎలా ప్రశ్నించారు. తనకు ఆంక్షలు విధిస్తున్నారని.. వాలంటీర్లకు మాత్రం ఎలాంటి ఆంక్షలు ఉండవని.. వారికి ఆంక్షలు విధిస్తే అరాచకాలు జరగవని అన్నారు.ఏపీలో మహిళలు మిస్సింగ్ గురించి తాను బెచితే.. తనపై వైసీపీ నాయకులు విమర్శలు చేశారని మండిపడ్డారు.