Breaking News
Saturday, July 27, 2024
Breaking News

మిడి మొత్తం వెయ్యి అయ్యింది…

- Advertisement -

సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అయ్యే అంశాలను ఉపయోగించుకుంటూ.. ట్రాఫిక్‌ నిబంధనలపై హైదరాబాద్‌ సిటీ పోలీసులు వినూత్నంగా అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల కుమారి ఫుడ్‌కోర్టుకు సంబంధించి పలు వీడియోలు, ఆమె మాటలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. వాటిని ఉపయోగిస్తూ తాజాగా హైదరాబాద్‌ సిటీ పోలీసులు ఆసక్తికర పోస్ట్‌ చేశారు.
‘మీది మొత్తం 1000 అయ్యింది.. యూజర్‌ ఛార్జెస్‌ ఎక్స్‌ట్రా’ అంటూ రోడ్డుపై సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ, హెల్మెట్‌ లేకుండా నిర్లక్ష్యంగా ద్విచక్రవాహనాన్ని నడుపుతున్న ఓ వ్యక్తి ఫొటోను నగర సిటీ పోలీసులు ఎక్స్‌ (ట్విటర్‌)లో పంచుకున్నారు. ట్రాఫిక్‌ నియమాలు పాటించండి.. సురక్షితంగా ఇంటికి చేరుకోండి అంటూ పేర్కొన్నారు. ట్రాఫిక్‌ పోలీసుల ప్రయత్నం నెటిజన్లను ఆకట్టుకుంది.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!