Breaking News
Saturday, July 27, 2024
Breaking News

మార్చి 9వ తేదీ తర్వాత లోక్‌సభ ఎన్నికలు

- Advertisement -

మార్చి 9వ తేదీ తర్వాత లోక్‌సభ ఎన్నికలు
న్యూ డిల్లీ ఫిబ్రవరి 20
లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం   సమాయాత్తమైంది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. వచ్చే నెల ఈసీ సార్వత్రిక ఎన్నికల నగారా మోగించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మార్చి 9వ తేదీ తర్వాత లోక్‌సభ ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించే అవకాశం ఉందని జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.కాగా, పార్లమెంట్‌ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందులో భాగంగానే ఈసీ బృందం గత కొన్ని రోజులుగా వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తోంది. రాజకీయ పార్టీలు, స్థానిక అధికారులతో సమావేశాలు నిర్వహించిన అధికారులు షెడ్యూల్‌ను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం.వీటితోపాటు జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను కూడా నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ అధికారులతో మార్చి 8, 9 తేదీల్లో ఈసీ బృంద భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సంసిద్ధతను పరిశీలించేందుకు మార్చి 12,13 తేదీల్లో జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్నట్లు సమాచారం. లోక్‌సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించే అవకాశాలపై ఒక అంచనాకు రానున్నట్లు తెలుస్తోంది.గతంలోలానే ఈ సారి కూడా ఏప్రిల్‌ – మే నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేలా ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. గత లోక్‌సభ ఎన్నికలకు 2019 మార్చి 10న షెడ్యూల్‌ ప్రకటించారు. ఏప్రిల్‌ 11 నుంచి మే 19వ తేదీ వరకూ ఏడు దశల్లో పోలింగ్‌ జరిగింది. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!