0.1 C
New York
Wednesday, February 21, 2024

చేవెళ్లలో బీఆర్ ఎస్ లేదు

- Advertisement -

మాజీ ఎంపి కొండ విశ్వేశ్వర రెడ్డి
బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం

హైదరాబాద్: రత్నంతో రెండు సార్లు కలిసి ఎన్నికలోపోటి  చేశాను. ఈసారి చేవెళ్ళలో రత్నం గెలుస్తారని నమ్మ్ం వచ్చింది. నన్ను కాంగ్రెస్ లోకి రమ్మంటే వెళ్ళాట్లేదని నాపై కాంగ్రెస్ నేతలు  పగ పట్టారని మాజీ ఎంపి కొండ విశ్వేశ్వర రెడ్డి అన్నారు. చేవెళ్ల లో బీ అర్ ఎస్ లేదు. చేవెళ్ల లో మా పోటీ కాంగ్రెస్ తోనే . తప్పకుండా కాంగ్రెస్ ను  ఓడగొడతాం. మా నియోజకవర్గంలో చాలా మండలాల్లో కాంగ్రెస్ కు అభ్యర్థి లేరు. ఇక్కడ ఒక కుటుంబ పాలన ఉంటే చేవెళ్ల లో మరో  కుటుంబ పాలన ఉంది. చేవెళ్ల అసెంబ్లీ గెలిస్తే పార్లమెంట్ సైతం గెలుస్తామని అయన అన్నారు. బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం మాట్లాడుతూ బీజేపీ లో చేరడం చాలా సంతోషంగా ఉంది. జలదృష్యం లో కేసిఆర్ పార్టీ పెట్టినప్పుడు 7నెలలు నా పదవి కాలం ఉన్న రాజీనామ చేసి బీ అర్ ఎస్ లో చేరాను. ఆకలితో అలమటించే తెలంగాణ కోసం పని చేశాను. అటువంటిది ఆ పార్టీలో నాకు ఒక్క పదవి కూడా ఇవ్వలేదు. నేను గట్టిగా మాట్లాడే వ్యక్తిని కాబట్టే పదవులు రాలేవు అనుకుంటా. ప్రత్యేక రాష్ట్రంలో ఎన్నుకున్న ప్రజా ప్రతినిదులు బాగు పడ్డారు ….తప్ప రాష్ట్ర ప్రజలు కాదు. కాంగ్రెస్ నమ్మించి మోసం చేసే పార్టీ. నేను కాంగ్రెస్లో కి వెళ్ళాలని అనుకోలేదు. వాళ్ళే రమ్మని పిలిచారు. టికెట్ అసురెన్స్ ఇస్తే కాంగ్రెస్ కి వస్తానని చెప్పాను. కానీ నాకీ వాళ్ల మీద నమ్మకం లేకే కాంగ్రెస్ కి వెళ్ళలేదు. టికెట్ వచ్చిన రాకున్నా బీజేపీ లో కొనసాగుతా. నా పిల్లలు ఎవరు రాజకీయాల్లో లేరని అన్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!