Breaking News
Friday, July 26, 2024
Breaking News

నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా…..

- Advertisement -

కరీంనగర్ లో కాంగ్రెస్ అభ్యర్ధి ఓడిపోతే రాజకీయ సన్యాసానికి సిద్దమా?
నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా…..
దమ్ముంటే నా సవాల్ కు సిద్ధమా?
మంత్రి పొన్నం ప్రభాకర్ కు బండి సంజయ్ కుమార్ సవాల్
కరీంనగర్
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాహిత యాత్రకు అడగడుగునా అడ్డంకులు స్రుష్టిస్తూ అరాచకాలు స్రుష్టించేందుకు యత్నిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ కు సవాల్ విసిరారు. ‘‘కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్దికి నేను ఏం చేశానో ప్రజలకు వివరిస్తూ ఎన్నికల్లోకి వెళుతున్నా. కేంద్రం ఎన్ని నిధులిచ్చిందో, మోదీ ఏం చేశారో చెబుతున్నా… రాముడు అయోధ్యలో పుట్టారనడానికి ఆధారాలేమిటని కించపర్చే వారిని ప్రశ్నిస్తూ జనంలోకి వెళుతున్నా. మీకు దమ్ముంటే.. ఇదే మీ విధానాలతో, మీ నినాదాలతో ఎన్నికల్లోకి వెళ్లండి. కరీంనగర్ లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా. రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటా. కాంగ్రెస్ అభ్యర్ధి ఓడిపోతే.. నువ్వు మంత్రి పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకునేందుకు సిద్ధమా? దమ్ముంటే నా సవాల్ ను స్వీకరించాలి’’ అంటూ బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. 6 గ్యారంటీలను అమలు చేయడం చేతగాక ప్రశాంతంగా ప్రజాహిత యాత్ర చేస్తుంటే కాంగ్రెస్ మూకలను పంపి విధ్వంసం స్రుష్టించాలనుకుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని పొన్నం ప్రభాకర్ ను హెచ్చరించారు. గతంలో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పొన్నం ప్రభాకర్ ఆయనను తీవ్రంగా వ్యతిరేకించారని… ఇప్పుడు కూడా ఇలాంటి విధ్వంసాలకు పాల్పడుతూ అరాచకాలు స్రుష్టిస్తూ శాంతి భద్రతల సమస్య తలెత్తేలా చూస్తున్నారని మండిపడ్డారు. రేవంతన్నా… పొన్నం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మలిదశ ప్రజాహిత్ర 2వ రోజు బొమ్మెనపల్లిలో ప్రారంభమై రాములపల్లెలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా హుస్నాబాద్ లో కాంగ్రెస్ మూకలు బీజేపీ ఫ్లెక్సీలు చింపివేస్తూ, బండి సంజయ్ దిష్టిబొమ్మలను దగ్దం చేస్తున్న విషయాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు.
ప్రజాహిత యాత్రను ప్రశాంతంగా కొనసాగిస్తున్నాం. మేం చేసిన అభివ్రుద్ధి, మోదీ ప్రభుత్వం చేసిన పనులను, కేంద్రం ఈ నియోజకవర్గానికి వెచ్చించిన నిధులను వివరిస్తూ ప్రజాహిత యాత్రను కొనసాగిస్తున్నాం. కానీ ఇక్కడున్న మంత్రి ప్రతిసారి హల్ చల్ చేయాలని చూస్తున్నడు. ప్రతిదాంట్లో ఇన్ వాల్వ్ అవుతున్నడు. నాకో డౌటొస్తుంది. గతంలో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనను వ్యతిరేకించారు. ఇప్పుడు సీఎంగా ఉన్నందున ప్రజలను రెచ్చగొడుతూ ఇట్లాంటి పనులు చేస్తున్నడేమో అనుమానం వస్తోంది. రేవంతన్నా జాగ్రత్తగా ఉండు…
నేనేమన్నా… రాముడు అయోధ్యలో పుట్టారనడానికి ఆధారాలేందని అడిగే వాళ్లను అడిగిన…. రాముడు అయోధ్యలోనే పుట్టారని చరిత్ర చెబుతోంది. సాక్షాత్తు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయినా ఆధారాల్లేందని వితండ వాదం చేస్తున్న వాళ్లను నేనడుగుతున్న… మీరు మీ అమ్మకే పుట్టారనడానికి ఆధారాలేంది? అట్లాగే నేను కూడా మా అమ్మకే పుట్టాననడానికి ఆధారాలేంది? అక్కడున్న నర్స్, డాక్టర్లు చెబితేనే కదా తెలిసేది…? నేను నిన్న కూడా అదే చెప్పిన.. అందులో తప్పేముంది? బరాబర్ మళ్లీ అంటా… అయినా మీరు మా రాముడిని కించపరిస్తే మేం ఎందుకు భరించాలి? ఎవరైతే రాముడి జన్మస్థలాన్ని, పుట్టుకను ప్రశ్నించే వాళ్లను చెప్పుతో కొట్టండి… అంతే తప్ప మమ్ముల్ని డిస్ట్రబ్ చేయాలనుకుంటే ఎట్లా? రాముడిని కించపర్చినందుకు, అయోధ్య అక్షింతలను కించపర్చినందుకు మిమ్ముల్ని జనం ఛీత్కరించుకుంటున్నారు… అయినా మీరు మారకపోతే మీకు తగిన బుద్ది చెబుతారని అన్నారు.
అసలు నేనడుగుతున్న… వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తానని చెప్పారు. ఇందిరాగాంధీ ఫోటో పెట్టుకుని మేనిఫెస్టో విడుదల చేశారు. ఇయాళ్టికి 80 రోజులైంది. ఎందుకు అమలు చేయడం లేదు? 6 గ్యారంటీలను, మేనిఫెస్టోలోని 423 హామీలను అమలు చేయకుంటే ఇందిరాగాంధీని అవమానించినట్లే… మీరే చెప్పారు. రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో మునిగిపోయిందని, అయినా హామీలు ఇచ్చారు. వాటిని ఎట్లా అమలు చేస్తారో చేసి చూపండి. నరేంద్రమోదీ ప్రభుత్వం రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా బియ్యం ఇస్తుంటే… రేషన్ షాపుల మద్ద ముఖ్యమంత్రి ఫోటోలు పెట్టుకోవడమేంది? ప్రధాని ఫోటో ఎందుకు పెట్టుకోవడం లేదు?  కొత్తగా మంత్రి అయినవ్… అని ఊరుకుంటున్న. మనోడే కదా? అని భరిస్తున్నా… కానీ మా సహనాన్ని చేతగానితనంగా భావిస్తే ఊరుకుంటామా? మా రాముడిని, దేవుడిని కించపరిస్తే భరించాలా?  నేను మంత్రికి సవాల్ చేస్తున్నా…. నేను కరీంనగర్ కు ఏం చేశానో, కేంద్రం ఏమిచ్చిందనే అంశంపై ఎన్నికల్లోకి వెళుతున్నా. రాముడి నినాదంతోనే జనంలోకి వెళుతున్నా. రాముడు అయోధ్యలో పుట్టారనే వాళ్లకు ఇదే సమాధానంతో ఎన్నికల్లోకి వెళుతున్నా… మీకు దమ్ముంటే మాకు వ్యతిరేకంగా నినాదంతో, మీ విధానాలతో మీ అభ్యర్ధిని నిలబెట్టండి. నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా. మళ్లీ రాజకీయాల్లోకి రాను… మీ అభ్యర్ధి ఓడిపోతే మీరు శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటావా? నా సవాల్ కు సిద్ధమా? దమ్ముంటే… నా సవాల్ ను అంగీకరించాలని అన్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!