Breaking News
Saturday, July 27, 2024
Breaking News

కీరవాణి స్టూడియోకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -

కీరవాణి స్టూడియోకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర గీతంగా జయ జయహే తెలంగాణ

సంగీతం అందించాలని కీరవాణిని కోరిన సీఎం రేవంత్ రెడ్డి..

మన రాష్ట్ర గీతానికి పొరుగు రాష్ట్రం వారు సంగీతం అందించడమేంటన్న టీసీఎంఏ
అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ కీరవాణితో రేవంత్ రెడ్డి సమాలోచనలు

జూన్ 2న సోనియా చేతుల మీదుగా గీతం ఆవిష్కరణ.

హైదరాబాద్

తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ కు సంగీతం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి  ప్రముఖ సినీ సంగీత  దర్శకుడు కీరవాణిని కోరడం, మన తెలంగాణ గీతానికి పొరుగు రాష్ట్రం వారు సంగీతం అందించడమేంటని తెలంగాణ సినీ మ్యూజీషియన్స్ సంఘం టీసీఎంఏ, తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం తెలిసిందే. ఆ మేరకు టీసీఎంఏ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసింది. అయితే ఈ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి  రాయదుర్గంలోని కీరవాణి స్టూడియోకి వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర గేయం రికార్డింగ్ పూర్తయిన నేపథ్యంలో మరోసారి మార్పులు, చేర్పులపై కీరవాణితో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు చేశారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో, ఈ గీతాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతుల మీదుగా విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే వీలైనంత త్వరగా పాటకు ఫైనల్ మిక్సింగ్ చేయాలని కీరవాణి భావిస్తున్నారు. ఈ పాటను ప్రముఖ ప్రజాకవి అందెశ్రీ 2003 లోనే రాసిన సంగతి తెలిసిందే. ముందు నాలుగు చరణాలతో పాట రాసిన అందెశ్రీ  2009 నాటికి పూర్తి పాటను రూపొందించారు. అప్పటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఈ గీతం విశేష ప్రజాదరణ పొందింది.
రాయదుర్గంలోని ఎంఎం కీరవాణి స్టూడియోను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సందర్శించారు. జయ జయహే తెలంగాణ, గీతంలో స్వల్ప మార్పులు, చేర్పులు చేస్తున్నందున అందుకు సంబంధించి ప్రముఖ కవి అందెశ్రీ, సంగీతదర్శకులు కీరవాణితో చర్చించేందుకు సీఎం స్టూడియోకు వెళ్లారు. ఇప్పటి వరకు ఉన్న తెలంగాణ గీతంలో స్వల్ప మార్పులు,చేర్పులు చేసే కార్యక్రమం కొనసాగుతోంది. అందులో జిల్లాల ప్రస్తావనతో పాటు మరికొన్ని అంశాలు ఉండటంతో వాటి స్థానంలో ఏయే అంశాలు ఉండాలి, అన్నదానిపై చర్చించినట్టు తెలుస్తోంది. సీఎం సలహాదారు నరేందర్‌రెడ్డితో కలిసి వెళ్లిన రేవంత్‌రెడ్డి ఆ పాటను ఒకటికి రెండు సార్లు విని అందులోని అంశాలపై చర్చించినట్టు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండడంతో గతంలో పది జిల్లాలు అన్నపదాన్నితొలిగించినట్లు సమాచారం. ఆ స్థానంలో పద పద అన్నపదాన్ని చేర్చినట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!