

అంతర్జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ప్రదర్శనలో విద్యార్థులు 60 విభాగాలకు సంబంధించిన ప్రయోగాలను ఏర్పాటు చేశారు. వీటిలో వాటర్ సైకిల్ సిస్టం , మానవ శరీరంలో ముఖ్యమైన అవయాల పనితీరుపై ఏర్పాటు చేసిన లైఫ్ సైకిల్ ప్రదర్శన ఆకట్టుకుంది. వీటితోపాటు 3d హాలో గ్రామ్, రోబో ,రాకెట్ ,ఏటీఎం ,లిఫ్ట్ ,లైట్ హౌస్ తృణధాన్యాలతో ఏర్పాటు చేసిన ఆకృతులు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ బుస్సా సులోచన మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి ప్రదర్శనలు దోహదపడతాయన్నారు. ప్రదర్శనలు నిర్వహించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమ్య, సైదులు, హర్ష, వీరయ్య ,రజియా ,హనీఫా ,భాగ్యలక్ష్మి, మల్లిక, తదితరులు పాల్గొన్నారు.