Breaking News
Saturday, July 27, 2024
Breaking News

పడిన చోటే వెతుక్కున్న పవన్

- Advertisement -

పడిన చోటే వెతుక్కున్న పవన్
గుంటూరు, జూన్ 5, (వాయిస్ టుడే)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఘన విజయాన్ని సాధించాడు. 70 వేల పై చిలుకు మెజార్టీ ఓట్ల తో భారీ విక్టరీని సాధించడమే కాకుండా పిఠాపురం ఎమ్మెల్యేగా తన మార్కు చూపించడానికి రెడీ అవుతున్నాడు. 2019 వ సంవత్సరంలో రెండు స్థానాల నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఒక్క స్థానంలో కూడా గెలుపొందకపోవడంతో వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ ని తీవ్ర స్థాయిలో విమర్శించారు.ఇక ఈ దెబ్బ తో పార్టీని పక్కన పెట్టేసి రాజకీయాల నుంచి వెళ్ళిపోతాడు అని అందరూ అనుకున్నారు. అలా చేస్తే ఆయన పవన్ కళ్యాణ్ ఎందుకు అవుతాడు… ఎటు వెళ్లకుండా అపోజిషన్ గా నిలబడ్డాడు.. ప్రభుత్వం చేసే పనులను ఎండగట్టాడు. ఇక రోజులు గడిచే కొద్ది పవన్ కళ్యాణ్ గొప్పతనం ఏంటో అక్కడి ప్రజలకు అర్థమైంది. అందుకే జగన్ పాలనకు స్వస్తి పలుకుతూ పవన్ కళ్యాణ్ ని భారీ మెజార్టీతో గెలిపించారు. దాంతో మొదటిసారి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి ఘన విక్టరీని కూడా సాధించాడు. ఇక ఇంతకు ముందు వైసిపి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ని ఇబ్బందులకు గురి చేసిన విషయం మనకు తెలిసిందే. ఆయన సినిమాలు రిలీజ్ చేయకుండా ఆపేసింది. రిలీజ్ అయిన సినిమా టిక్కెట్ల ధరలు తగ్గించి ఆయన సినిమాలకి కలెక్షన్స్ రాకుండా చేశారు.తద్వారా తను పార్టీ ని నడుపుకోలేని స్థితికి చేరుకొని రాజకీయాల నుంచి వైదొలగాలనే ఒక కుట్రను పన్నారు. ముగ్గురు పిల్లలు అంటూ హేళన చేశారు. అయినప్పటికీ తన గెలుపుని ముందే ఊహించిన పవన్ కళ్యాణ్ వాళ్ల అరాచకాలను ఓపిక పట్టుకుంటూ ముందుకు సాగాడు. మొత్తానికైతే వైసీపీ పార్టీ కి మొగుడుగా మారి భారీ విజయాన్ని సాధించాడు… ఇక తన కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపుతూ, తను ఇబ్బంది పడిన కూడా తన పక్కవారిని ఇబ్బంది పెట్టకుండా తను ఎక్కడ కృంగిపోకుండా, అడుగు ఎక్కడ తడబడకుండా, ప్రయాణించే చీకటి దారిలో ఎన్నో ప్రళయాలు, ప్రవాహాలు, విపత్తులు, విగదాలు, అరాచకాలు, అకృత్యాలు ఎదురైనప్పటికి వాటన్నింటినీ దాటుకొని ఈరోజు కోసం ఎన్నో నిద్రలేని రాత్రులను కూడా గడిపాడు. తను తలుచుకుంటే లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తూ రోజుకు రెండు కోట్లు తీసుకుంటూ హాయిగా సినిమాలు చేసుకుంటూ జీవితాన్ని కొనసాగించవచ్చు. కానీ పేద ప్రజలకు ఏదో ఒకటి చేయాలి. ఈ రాష్ట్రానికి పట్టిన దారిద్రాన్ని వదిలించాలనే ఒకే ఒక కాన్సెప్ట్ తో ముందుకు కదిలిన పవన్ కళ్యాణ్ ఈరోజు ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. తన పార్టీ అభ్యర్థులను కూడా గెలిపించుకోగలిగాడు.ఇక పవన్ కళ్యాణ్ గెలుపు చాలామందికి మార్గదర్శకంగా మారింది. ఎక్కడ పడ్డాడో అక్కడే నిలబడి చూపించాడు. ఎవరైతే అసెంబ్లీ కి రానివ్వం అన్నారో వాళ్ళనే అసెంబ్లీ గేటు కూడా తాకకుండా చేశాడు. ఆయన్ని విమర్శించిన వాళ్ళ అడ్రస్ లు గల్లంతయిపోయేలా చేశాడు..ఓటమిని ఒప్పుకోలేని వాడే గెలుస్తాడు అనేది మాత్రం వాస్తవం..

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!