Breaking News
Saturday, July 27, 2024
Breaking News

తెలంగాణ మాడల్ దేశంలో ఎక్కడా లేదు

- Advertisement -

న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా జలవిహార్ లో తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనము శనివారం జరిగింది. ముఖ్య అతిథిగా  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పాల్గోన్నారు.  ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, బార్ కౌన్సిల్ మెంబర్ గండ్ర మోహన్ రావు, బిసి కమిషన్ మెంబర్ ఉపేంద్ర, ఫుడ్ కమిషన్ మెంబర్ కొంతం గొవర్ధన్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు హజరయ్యారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో హాజరైన న్యాయవాదులు వచ్చారు.
కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులతో పోటీగా న్యాయవాదులు ఉద్యమం చేశారు. సీఎం కేసీఆర్ పార్లమెంట్ ముట్టడి కి పిలుపునిస్తే అప్పుడు కూడా ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యమంలో వందల , వేల కేసుల్లో మాకు అండగా నిలిచారు ఒక్క రూపాయి కూడా ఆశించకుండా మాతో నిలబడ్డారు అందరికి ధన్యవాదాలు. అప్పుడేట్లుండే తెలంగాణ ఇప్పుడేట్లుండే తెలంగాణ అభివృద్ధి మన కళ్ళ ముందు కనిపిస్తుందని అన్నారు.

telangana-model-is-not-available-anywhere-in-the-country
telangana-model-is-not-available-anywhere-in-the-country

2014 లో కరెంట్, సాగునీరు,తాగునీరు,వైద్యం,విద్యావవస్థలు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉందో చూడండి. అక్టోబర్ 25 న కర్ణాటక డిప్యూటీ సీఎం డికే k శివకుమార్ ఫ్యాక్స్ కాన్ కి లేఖ రాశారు హైదరాబాద్ లో పెట్టాలిసిన ఫ్యాక్టరీ బెంగుళూరుకు తరలించాలని లేఖ రాశారు. తొందరలో తెలంగాణ లో మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది హైదరాబాద్ లో ఉన్న పలు కంపెనీలు బెంగుళూరుకు వస్తున్నాయ్ అని లేఖ రాసారు. సీఎం కేసీఆర్ ని వదులుకుంటే ఎం జరుగుతుందో ఇదొక చిన్న ఉదాహరణ. కాంగ్రెస్ చేతుల్లోకి తెలంగాణ వెళితే ఢిల్లీ,బెంగుళూరు నుండి పాలన కొనసాగుతుంది. నాలుగేళ్లు వెంబడి పడి ఫ్యాక్స్ కాన్ సంస్థ మనవద్దకు తెచ్చుకున్నమని అన్నారు. ఫ్యాక కాన్ కి కొంగరకాలన్ లో 200 ఎకరాలు ఇచ్చాము నిర్మాణం జరుగుతుంది మే లో ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి కొన్ని వేల మందికి ఉపాధి లభిస్తుంది. తెలంగాణ మాడల్ దేశంలో ఎక్కడా లేదని అన్నారు.  మూడున్నర కోట్ల వరిదాన్యం పండిస్తున్నము దేశానికి అన్నం అందిస్తూ అన్నపూర్ణగా మారింది తెలంగాణ  అని అన్నారు.
హరితహారం ద్వారా 7.7 శాతం గ్రీనరి పెరిగింది. కొత్త పరిశ్రమలు వస్తున్నాయి. దేశంలో అన్ని రంగాల్లో ముందున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. దళితబంధు లాంటి పథకం పెట్టాలంటే నాయకునికి దమ్ము ధైర్యం కావాలి. సీఎం కేసీఆర్ దమ్మున్న దక్షిత కలిగిన నాయకుడు కాబట్టి ఇలాంటి అద్భుతమైన పథకాలు వస్తాయని అన్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!