29.6 C
New York
Wednesday, June 19, 2024

మళ్లీ మండుతున్న ఎండలు

- Advertisement -

మళ్లీ మండుతున్న ఎండలు
హైదరాబాద్, జూన్ 3(వాయిస్ టుడే)
తెలంగాణలో ఉష్ణోగ్రతలు చేదాటాయి. భానుడి భగభగలతో ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 47 శాతం దాటి నమోదవుతున్నాయి. సింగరేణి ప్రాంతంలో ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. మంచిర్యాల జిల్లా భీమారం,పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ లలో 47.1 డిగ్రీలుగా నమోదైంది. ఈ జిల్లాలలో ఇతర ప్రాంతాల్లో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ చెబుతోంది.ఎండలు తీవ్రత మరి ఎక్కువగా ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలోనైతే ఓ వ్యక్తి ఇంటి ఆవరణంలో పార్కింగ్ లో ఉన్న 20 ద్వి చక్రవాహనాలు దాదాపు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఎండవేడికి తట్టుకోలేక ఈ ద్విచక్ర వాహనాలను కాలి బూడిద అయిపోయాయి. అంతేకాక వాహనాలతో పాటు ఓ ఇల్లు కూడా ఈ ప్రమాదంలో కాలిపోయింది. సుమారు 10 లక్షల వరకు నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా రాష్ట్రంలో పలువురు చనిపోవడం ఆందోళన కలిగిస్తుంది. కరీంనగర్ జిల్లా వీణవంకలో కళ్యాణం రామక్క అనే వృద్ధురాలు వడదెబ్బతో మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిమెంట్ లారీ నడిపే లారీ డ్రైవర్ జాకీర్ హుస్సేన్ శుక్రవారం వడదెబ్బ కారణంగా తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఎండ వేడిని తాళలేక కళ్ళు చెమ్మగిల్లి పడిపోయారు. ఆయన పరిస్థితిని గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేసినప్పటికీ హుస్సేన్ ను కాపాడలేకపోయారు. గత సంవత్సరం కన్నా..ఈసారి ఎండలు తీవ్రత, ఉష్ణోగ్రతల పెరుగుదలలో గణనీయమైన మార్పులు వచ్చినట్లు వాతావరణ శాఖ చెబుతుంది. అందువల్ల అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని హెచ్చరిస్తుంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు నడుచుకోవాలని సూచిస్తుంది.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!