హైదరాబాద్, నవంబర్ 3, (వాయిస్ టుడే ): పాలకులు ప్రజల బాగోగుల గురించి ఆలోచించాలి అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కానీ, బలహీనమైన వర్గ ప్రజలు ఏమైనా పర్వాలేదు అనుకుంది రాష్ట్ర ప్రభుత్వం.. దళిత ,గిరిజన ,మైనారిటీ బలహీన వర్గాలు 92 శాతం ఉన్నారు.. మీరు సీఎం కావడానికి.. మొదటి దళిత ముఖ్యమంత్రి అని కలల ప్రపంచం సృష్టించారు అని ఆయన తెలిపారు. దళితులకు 3 ఎకరాల భూమి, దళిత బంధు ఇస్తామన్నారు.. ఇవేవి ఇవ్వలేదు.. బడ్జెట్ లో 17,700 కోట్లు లెక్కలు చూపించారు.. కనీసం 300 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయలేదు.. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో రమాకాంత్ బోనాధ్ మండలంలో దళిత బంధు రాక ఆత్మహత్య చేసుకున్నాడు అని భట్టి విక్రమార్క ఆరోపించారు. నా ఆత్మహత్య మీరే కారణామంటు లేఖ రాసి చనిపోయారు.. రాజ్యాధికారం కోసం ఎన్ని లక్షల మంది జీవితాలతో ఆడుకుంటారు అని భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఎస్సి ,ఎస్టీ సబ్ ప్లాన్ అమలు చేయడం లేదు.. మీ మోసపూరిత వాగ్దానాలతో దళిత గిరిజన కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి.. తెలంగాణ కోసం కన్న కలలు నేరేవేరలేదు అని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ మాత్రమే మీ కలలు నిజం చేస్తాం.. దొరల తెలంగాణ పోయి ప్రజల తెలంగాణ తీసుకొస్తామని రాహుల్ గాంధీ చెప్పారు.. దళిత గిరిజన కుటుంబాలకు విజ్ఞప్తి.. ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు అని భట్టి విక్రమార్క కోరారు.తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. మీకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది.. నెల రోజులు కొట్లాడి కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చుకుందాం.. సూసైడ్ నోట్ పై విచారణ జరిపించాలి.. వారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ అండగా ఉంటుంది..
ముఖ్యమంత్రి, కొడుకు ,కూతురు , అల్లుడు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు. వామపక్షాలతో మాట్లాడాం.. వారి పొత్తుల అంశం జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుందన్నారవైఎస్ షర్మిల కాంగ్రెస్ కి మద్దతు తెలపడం సంతోషం అని భట్టి విక్రమార్క తెలిపారు. వైఎస్సార్ కూతురుగా కాంగ్రెస్ నష్టం జరగకూడదనే ఆమె నిర్ణయం స్వాగతిస్తున్నాం.. ఎన్నికల్లో భావస్వరూప్యత పార్టీలుగా చర్చలు జరుగుతుంటాయి.. షర్మిల ఇప్పటికే మా అధిష్టానాన్ని కలిశారు.. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు యాత్ర ద్వారా ఏకాం చేసే ప్రయత్నం చేశారు అని ఆయన చెప్పుకొచ్చారు. ఆయన జాతీయ నాయకుడు ఎక్కడ పోటీ చేయాలనేది ఏఐసీసీ నిర్ణయిస్తుంది.. రాహుల్ గాంధీ ఎక్కడ పోటీ చేయాలనేది అసదుద్దీన్ కి అవసరం లేదు.. ఆయన ఎంఐఎం అభ్యర్థులను చూసుకుంటే సరిపోతుంది.. మేము ఎక్కడెక్కడ పోటీ చేయాలి అనేది సీఈసీ నిర్ణయిస్తుంది అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.