Breaking News
Saturday, July 27, 2024
Breaking News

మీ ఫోన్‌లో వైరస్‌ ఉందా!?

- Advertisement -

*మీ ఫోన్‌లో వైరస్‌ ఉందా!?*

*తగిన జాగ్రత్తలతో డేటాను భద్రపరచుకోవచ్చంటున్న నిపుణులు*

* స్మార్ట్‌ఫోన్లు అందు బాటులోకి వచ్చాక మన పనులు ఎంత సులు వయ్యాయో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే దానితో బోలెడు ముప్పులు సైతం పొంచి ఉన్నాయని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తు న్నారు. ముఖ్యంగా సైబర్‌ నేరగాళ్లు ఫోన్లలోకి ఏదో ఒక రూపంలో వైరస్‌ను చొప్పించి ఫొటో లు, వీడియోలు సహా కీలక డేటా కొట్టేయడం, మార్ఫింగ్‌కు వాడుకోవడం లేదా ఆ సమాచారంతో బ్లాక్‌మెయిల్‌ చేయడం వంటి ఆగడాలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మన ఫోన్లో వైరస్‌ చొరబడితే దాని పనితీరు ఎలా ఉంటుందో, హ్యాకింగ్‌కు గురైన ఫోన్‌ను తిరిగి ఎలా బాగుచేసుకోవాలో కీలక సూచనలు చేశారు.*

*💥హ్యాకింగ్‌కు గురయ్యే ఫోన్‌ పనితీరు ఇలా*

*► ఫోన్‌ చార్జింగ్‌ చేసిన కాసేపటికే చార్జింగ్‌ డౌన్‌ కావడం లేదా వేగంగా బ్యాటరీ తగ్గి పోవడం ఫోన్‌ హ్యాకింగ్‌కు అత్యంత ముఖ్య మైన సంకేతం. మన ఫోన్‌లో ఏవైనా అనుమానాస్పద సాఫ్ట్‌వేర్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్‌ అవుతుంటే.. మన మొబైల్‌ ఫోన్‌ను తక్కువగా వాడినా, బ్యాటరీ మాత్రం అసాధరణంగా తగ్గిపోతుంది.*

*► మనకు తెలియని సోర్స్‌ల నుంచి కొత్తకొత్త యాడ్స్‌ వస్తుండటం, ఫ్లాష్‌ యాడ్స్‌ వస్తుండటం సైతం హ్యాకింగ్‌కు గురైనట్లు తెలిపే సూచిక.*

*► మనకు తెలియకుండానే బ్యాక్‌గ్రౌండ్‌ యాప్స్‌ రన్‌ అవడం, కొన్ని హిడెన్‌ యాప్స్‌ పనిచేస్తుండటంతో మొబైల్‌ ఫోన్‌ బాగా వేడెక్కుతుంది. ఇలా జరిగితే కూడా ఫోన్‌ హ్యాక్‌ అయినట్లు అనుమానించాలి.*

*► కొత్త నంబర్ల నుంచి తరచూ ఫోన్‌ కాల్స్‌ వస్తుండటం, టెక్సŠట్‌ మెసేజ్‌లలో వింత సింబల్స్, క్యారెక్టర్ల కాంబినేషన్స్‌తో రావడం గమనిస్తే ఫోన్‌ హ్యాక్‌ అయినట్లు గుర్తించాలి.*

*► మొబైల్‌ఫోన్‌ హ్యాక్‌ అయితే పనితీరు బాగా నెమ్మదిస్తుంది. ఫోన్‌కాల్‌ చేయడానికి, మెసేజ్‌లు ఓపెన్‌ కావడానికి, ఇతర యాప్‌లు పనిచేయడం నెమ్మదిగా జరుగుతుంది.*

*► ఫోన్‌లోని కెమెరా, మైక్రోఫోన్‌లు మనకు తెలియకుండానే యాక్టివ్‌ కావడం గమనిస్తే అనుమానించాల్సిందే.*

*► ఫోన్‌లోని స్క్రీన్‌లాక్, యాంటీ వైరస్‌ వంటి సెక్యూరిటీ ఫీచర్లన్నీ మనకు తెలియకుండానే డిసేబుల్‌ కావడం ఫోన్‌ హ్యాకింగ్‌ అయ్యిందనడానికి అత్యంత కీలకమైన మార్పుగా గుర్తించాలి.*

*💥ఫోన్‌ హ్యాక్‌ అయితే ఏం చేయాలి..?*

*► ఏదైనా ఉత్తమమైన యాంటీ వైరస్‌ సాప్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకొని ఫోన్‌ను స్కాన్‌ చేయాలి.*

*► ఫోన్‌లో అనుమానాస్పద యాప్‌లను గమనిస్తే వాటిని వెంటనే డిలీట్‌ చేయాలి.*

*► ఫోన్‌ హ్యాక్‌ అయి, ఫోన్‌ నుంచి డేటా ట్రాన్స్‌ఫర్‌ అవుతున్నట్లు అనుమానిస్తే వెంటనే ఇంటర్నెట్‌ డేటా ఆఫ్‌ చేయాలి. వైఫై కనెక్షన్‌ తొలగించాలి. ఇలా చేయడం వల్ల హ్యాకర్లకు డేటా ట్రాన్స్‌ఫర్‌ ఆగిపోతుంది.*

*► ఫోన్‌ స్కీన్ర్‌ లాక్, యాప్‌ లాక్‌లు, ఈ–మెయిల్, సోషల్‌ మీడియా ఖాతాల పాస్‌వర్డ్‌లను మార్చేయాలి. ఇలా చేయడం వల్ల మన వ్యక్తిగత సమాచారం చోరీ కాకుండా అడ్డుకోవచ్చు.*

*► పైవన్నీ చేసినా ఫలితం లేనట్లు గుర్తిస్తే వెంటనే ఫోన్‌ను రీసెట్‌ చేయాలి. దీనివల్ల మాల్‌వేర్‌ అంతా పోవడంతోపాటు అను మాస్పద యాప్‌లు డివైస్‌ నుంచి తొలగి పోతాయి. అయితే మన వ్యక్తిగత సమా చారం, ఫొటోలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.*

*💥ఈ జాగ్రత్తలు పాటిస్తే మేలు..*

*► మొబైల్‌ ఫోన్‌లోని ఫొటోలు, వీడియో లు, ఇతర డేటాను, సోషల్‌ మీడియా ఖాతాల్లోని సమాచారాన్ని ఎప్పటిక ప్పుడు పెన్‌డ్రైవ్, ఇతర డివైస్‌లలో బ్యాకప్‌ చేస్తూ ఉండాలి. ఫోన్‌ హ్యాక్‌ అయినా వెంటనే దాన్ని రీసెట్‌ చేయొ చ్చు.ముందే బ్యాక్‌అప్‌ ఉంటుంది కాబ ట్టి డేటా పోయే ప్రమాదం ఉండదు.*

*► యాపిల్, ఆండ్రాయిడ్‌ ఫోన్లకు ఆరు అంకెల పాస్‌వర్డ్‌లు తప్పక పెట్టుకోవాలి. వాటిని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి.*

*► కొత్త యాప్‌లు ఇన్‌స్టాల్‌ చేసే ముందు పూర్తిగా వాటికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలి.*

*► పబ్లిక్‌ వైఫైను వీలైనంత వరకు వాడకపోవడం ఉత్తమం. తప్పనిసరైతే వీపీఎన్‌ టూల్స్‌ ద్వారా వాడాలి. ఇలా చేయడం వల్ల మన డేటా ప్రైవేటు ఎన్‌క్రిప్టెడ్‌ చానల్‌ ద్వారా వెళ్తుంది.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!