Breaking News
Saturday, July 27, 2024
Breaking News

ఆసియా క్రీడల్లో భారత్  హవా

- Advertisement -

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30:  ఆసియా క్రీడల్లో భారత్ కు పతకాల పంట పండుతోంది. ఆసియా క్రీడలు 2023 చైనాలోని హాంగ్‌జౌలో సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు భారత అథ్లెట్లు 39 క్రీడలలో పోటీ పడుతున్నారు. కాగా ఇప్పటి వరకు భారత్ ఖాతాలో 10 స్వర్ణాలతో సహా మొత్తం 38 పతకాలు వచ్చి చేరాయి. దీంతో పతకాల పట్టికలో భారత్ నాల్గవ స్థానంలో నిలిచింది. ఇక ఆతిథ్య చైనా 100 బంగారు పతకాల మార్కును దాటింది.తాజాగా టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ లో బోపన్న, రుతుజా భోసలే టీమ్ బంగారు పథకం సాధించింది. 2-6, 6-3, 10-4తో చైనీస్ తైపీపై వారు విజయం సాధించారు. చైనాలోని హాంగ్‌జౌలో ఆసియా క్రీడలు జరుగుతుండగా.. ప్రతిష్టాత్మకమైన ఈ గేమ్స్‌లో భారత ప్లేయర్లు సత్తా చాటుతున్నారు. వరుసగా మెడల్స్ సాధిస్తూ దూసుకుపోతున్నారు.భారత షూటర్లు పతకాల వేట కొనసాగిస్తున్నారు. అలాగే 10 మీటర్ల పిస్తోల్ మిక్స్డ్ ఈవెంట్ లో దివ్యా టీఎస్, సరత్ బోత్ సింగ్ జోడి సిల్వర్ పతకాన్ని కైవసం చేసుకుంది. గోల్డ్ మెడల్ కోసం ఇండియన్ టీం తీవ్రంగా పోరాడింది. అయితే ఫైనల్ లో చైనా జోడి బంగారు పతకాన్ని ఎగరేసుకుపోయింది.షూటింగ్ విభాగంలో ఇండియాకు ఇది 19వ మెడల్ కావడం విశేషం. ఫైనల్ స్కోర్ లో 16-14 తేడాతో ఇండియాను బీట్ చేసింది. చైనీస్ షూటర్లు జాంగ్ బోవెన్, జియాంగ్ కాంగ్జిన్ లు తమ ఖాతాలో గోల్డ్ మెడల్ వేసుకున్నారు. ఇప్పటి వరకు షూటింగ్ విభాగంలో ఇండియాకు ఆరు స్వర్ణాలు, 8 వెండి, 5 రజత పతకాలు దక్కాయి. క్వాలిఫికేషన్ రౌండ్ లో సరబ్ జోత్ 291 పాయింట్లు స్కోర్ చేయగా.. దివ్య 286 స్కోర్ చేసింది. ఇద్దరు కలిసి 577 పాయింట్లు సాధించారు. ఆ రౌండ్ లో చైనీయులకన్నా ఇండియన్ బృందం బెటర్ గా పర్ఫార్మ్ చేసింది.

India in Asian Games
India in Asian Games

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!