Breaking News
Saturday, July 27, 2024
Breaking News

తూము మనోజ్ కు జనసేన టికెట్ కేటాయిస్తే కూకట్ పల్లి లో జయకేతనం ఎగుర వేయడం ఖాయం — ?

- Advertisement -

ప్రతిష్టాత్మకమైన కూకట్ పల్లి నియోజకవర్గంలో విభిన్నమైన ప్రాంతాల వారితోపాటు  వివధ వర్గాల ప్రజలు నివసిస్తున్న కూకట్ పల్లి మినీ ఇండియాగా పేరు పొందింది. రాజకీయ నేపథ్యంగా కూకట్ పల్లి నియోజకవర్గం పరిధిలోని మూసాపేట ప్రాంతానికి చెందిన స్థానికుడు తూము మనోజ్ కుమార్ గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పటి నుండి చిరంజీవి వెన్నంటే ఉన్నారు.  ఆయన 2009 లో రాష్ట్ర బీసీ కోఆర్డినేటర్ గానూ, హైదరాబాద్ సిటీ జనరల్ సెక్రటరీ గా పని చేశారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం చేసిన అనంతరం కాంగ్రెస్ టెలికామ్ అడ్వైసరీ కమిటీ సభ్యులుగా పనిచేశారు. బ్లడ్ క్యాంపులు, అనాధ పిల్లలకు బట్టల పంపినీ లాంటి అనేక సేవా కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు పొందారు. సినీ నటులు జీవిత రాజశేఖర్ లు బ్లడ్ అమ్ముకుకుంటున్నారని చిరంజీవిపై ఆరోపణలు చేసిన సమయంలో వాళ్లపై పరువు నష్టం దావ కేసువేశారు. ప్రస్తుతం మున్నూరుకాపు రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీగా ,భారతీయ కాపు ఐక్య వేదిక వైస్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం నవంబర్ లో జరగనున్న ఎన్నికల్లో భాగంగా కూకట్ పల్లి నియోజకవర్గంలో రోజురోజుకు ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఆయా పార్టీల అధినాయకత్వం తర్జన భర్జనలు పడుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీ అభ్యర్థులను ముందుగా ప్రకటించి ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న తరుణంలో బీజేపీ, జనసేన పారీ అధినాయకత్వం ఇప్పటికీ తమ అభ్యర్ధుల పరకటించడంలో నేటికీ స్పష్టత లేకపోవడంతో ఎమ్మెల్యే టిక్కెట్ ను ఆశిస్తున్న ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారు తలమునకలై అధినాయకత్వం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కాగా స్థానికంగా అన్ని వర్గాల వారితో మంచి సత్సంబంధాలు ఉన్న నాయకుడు, కూకట్ పల్లి నియోజకవర్గం లో అవపోసన పట్టిన మున్నూరు కాపు నేత స్థానికుడైన తూము మనోజ్ కుమార్ కు జనసేన పార్టీ టిక్కెట్ కేటాయిస్తే కూకట్ పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ జయకేతనం ఎగుర వేయడం ఖాయమని, ఈవిషయంలో అధిష్టానం ఆలోచించాల్సిన అవసరం ఉందని కొందరు రాజకీయాల్లో తలపండిన నేతలు సూచిస్తున్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!